పట్టణ మెరుపు మన చేతుల్లోనే..!
– పాత వస్తువులను ఆర్ఆర్ఆర్ కు ఇవ్వండి
– మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్
– మేరీ లైఫ్ మేరా స్వచ్ఛ ష హేర్పై అవగాహన
తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరు పట్టణాన్ని మెరిసేలా తీర్చిదిద్దడం మనందరి చేతుల్లోనే ఉందని, పారిశుద్ధ్య నిర్వహణలో అందరి భాగస్వామ్యం అవసరముందని మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ అన్నారు. ఆదివారం మున్సిపల్ పరిధిలోని 27వ వార్డులో మేరీ లైఫ్ – మేరా స్వచ్చ షహేర్ కార్యక్రమంలో భాగంగా ఆర్ఆర్ఆర్(రెడ్యూస్, రీయూజ్, రీ సైకిల్) పై అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ మాట్లాడుతూ పర్యావరణాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ఇండ్లలో వాడిన పాత బట్టలు, దుప్పట్లు, వస్తువులు, ఇతర వస్తువులు ఆర్ఆర్ఆర్ కేంద్రాలకు తిరిగి ఇవ్వాలన్నారు. పట్టణంలో పారిశుద్ధ్య నిర్వహణలో అందరి భాగస్వామ్యం అవసరముందన్నారు. వచ్చేనెల జూన్ 5 ప్రపంచ పర్యావరణ దినోత్సవం నాటికి పట్టణం మొత్తం మెరిసేలా అందరం కలిసి ఆదర్శంగా నిలుపుదామన్నారు. అనంతరం పట్టణ పరిశుభ్రతపై ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శంకర్ సింగ్, మేనేజర్ నరేందర్ రెడ్డి, డీఈ ఖాజా, ఇంచార్జ్ శానిటరీ ఇను స్పెక్టర్ కృష్ణ, జూనియర్ అసిస్టెంట్ నీరటి శ్రీనివాస్. ఎన్విరాల్ మెంట్ ఇంజనీర్ ప్రవీణ్ కుమార్, మెప్మా సిబ్బంది, ఆర్బీలు తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి…
గేదేను కాటేసిన పిచ్చికుక్క..!
– దాని పాలను తాగి దూడ మృతి
– అవే పాలను అమ్మిన యజమాని
– తరువాత ఏం జరిగిందంటే..??
https://dharshininews.com/17279


