వ్యక్తి దారుణ హత్య
– శరీరంపై బలమైన కత్తి గాట్లు
– తాండూరు పట్టణంలో కలకలం
– దర్యాప్తు చేపడుతున్న పోలీసులు
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణంలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. మంగళవారం చోటు చేసుకున్న ఈ సంఘటన కలకలం సృష్టించింది. మృతుని బంధువులు తెలిపిన ప్రాథమిక వివరాలిలా ఉన్నాయి. తాండూరు పట్టణం చెంగోల్ బస్తీ ప్రాంతానికి చెందిన మదికంటి సతీష్ (25) గతంలో మోబైల్ షాపు నిర్వహించేవాడు. ఇతనికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు.

లాక్ డౌన్ ముందు షాపు మూసేసి కొన్నాళ్లు ఖాళీగా ఉన్నాడు. లాక్ డౌన్ ముగిసిన కొన్నాళ్ల తరువాత కూరగాయల వ్యాపారం నిర్వహించేవాడు. వచ్చిన డబ్బులతో మద్యం సేవించి.. ఘర్షణలకు పాల్పడడం చేసేవాడు. ఈ క్రమంలో భార్య ఇద్దరు పిల్లలతో కలిసి వదిలిపెట్టి వెళ్లిపోయింది. ఆ తరువాత తల్లి మాణెమ్మ, ఒక కుమారుడుతో కలిసి ఉండేవాడు. ఇతనికి తమ్ముడు రవి కూడా ఉన్నాడు. తల్లితో కూడ గొడవ పడడంతో ఆమె పట్టణంలోని వేరో చోట అద్దెకు ఉంటున్నట్లు తెలిసింది. అయితే సతీష్ తరుచుగా తెలిసిన వారితో గొడవ పడుతూ ఉండేవాడు. తాజాగా రెండు రోజుల క్రితం ఓ వ్యక్తితో ఘర్షణ పడినట్లు తెలిసింది. మంగళవారం చెంగోల్ బస్తీలోని ఇంట్లో సతీష్ ఒంటరిగా ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు. మధ్యాహ్నం తరువాత సతీష్ కు బందువు అయ్యే ఓ మహిళ తన భర్తకు ఫోన్ చేసి సతీష్ హత్యకు గురైనట్లు తెలిపింది.
విషయం తెలుసుకున్న శ్రీనివాస్ అనే వ్యక్తి పోలీసులకు సమాచారం అందించాడు. శ్రీనివాస్ ఇంటికి వచ్చి చూసే సరికి సతీష్ రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతున్నాడు. సతీష్ శరీరంపై ఎవరో బలంగా కత్తితో దాడి చేసిన గాయాలు ఉన్నాయి. వెంటనే అంబులెన్స్ చికిత్స నిమిత్తం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సతీష్ మృతి చెందాడు. సతీష్ ను కత్తితో దాడి చేసి హత్య చేసిన సంఘటన స్థానికంగా కలకలం రేపింది. అతన్ని ఎవరు హత్య చేసి ఉంటారని.. స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. విషయం తెలుసుకున్న తాండూరు పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
ఇది కూడా చదవండి…
పైలెట్‌తోనే పట్టణాభివృద్ధి..!
– రూ.80లక్షలతో 25,6వ వార్డుల్లో అభివృద్ధి పనులు
– బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు అఫ్పూ(నయూం)
https://dharshininews.com/17307


