వీరశైవ లింగాయత్ బలిజ సంఘం పట్టణ కార్యవర్గం ఎన్నిక

తాండూరు రాజకీయం వికారాబాద్

వీరశైవ లింగాయత్ బలిజ సంఘం పట్టణ కార్యవర్గం ఎన్నిక
– ప్రకటించిన జిల్లా అధ్యక్షులు పటేల్ ఉదయ్ శంకర్
తాండూరు, దర్శిని ప్రతినిధి : వీరశైవ లింగాయత్ లింగ బలిజ సంఘం తాండూరు పట్టణ కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. శుక్రవారం తాండూరులో కొత్త కార్యవర్గాన్ని ఎన్నుకున్నట్లు సంఘం జిల్లా అధ్యక్షులు ఉదయ్ శంకర్ ప్రకటించారు. సంఘం తాండూరు పట్టణ అధ్యక్షులుగా గాజుల వీరప్రసాద్, గౌరవాధ్యక్షులుగా యెడ్రామి బసనప్ప, ఉపాధ్యక్షులుగా ఆర్. శరణ బసప్ప, తుప్పుడు శేఖర్, అల్పూరి చంద్రశేఖర్, ప్రధాన కార్యదర్శిగా పటేల్ విజయ్ కుమార్, కార్యనిర్వహాక కార్యదర్శిగా ఎం.మల్లికార్జున్, సహా కార్యదర్శులుగా అల్లం మల్లికార్జున్, గాజుల కమలాకర్, కాసాల నరేందర్, కోశాధికారిగా మేడి విజయ భాస్కర్, న్యాయ సలహదారులుగా చిగురు శరత్ చంద్ర, కార్యవర్గ సభ్యులుగా గాజుల బస్వరాజ్, యెడ్రామి సిద్రారామప్ప, మదిరే రాచప్ప, పటేల్ రాజేంద్రప్ప, తుప్పుడు బస్వరాజ్, వీరణ్ణలను ఎన్నుకున్నట్లు ప్రకటించారు.

కొత్త కార్యవర్గ సభ్యులు వీరశైవుల అభ్యున్నతితో పాటు వీరశైవులను ఓబీసీలోకి మార్చేందుకు పోరాటం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గౌరవాధ్యక్షులు మోలిగి వీరేశం, సభ్యులు తదితరులు ఉన్నారు.

ఇదికూడా చదవండి…

జన జాతరను జయప్రదం చేయండి