సూర్తిదాయకుడు సురవరం ప్రతాప్ రెడ్డి

తాండూరు రాజకీయం వికారాబాద్

సూర్తిదాయకుడు సురవరం ప్రతాప్ రెడ్డి
– ఆయన ఆశయాలను ఆదర్శంగా తీసుకోవాలి
– తాండూరులో ఘనంగా జయంతి వేడుకలు
తాండూరు, దర్శిని ప్రతినిధి : తెలంగాణ వైతాళికులు స్వర్గీయ సురవరం ప్రతాప రెడ్డి సూర్తిదాయకులు అని అనంత సాహిత్య వేదిక ప్రతినిధులు అన్నారు. ఆదివారం తాండూరు పట్టణం సాయిపూర్ లోని శివాలయంలో సురవరం ప్రతాప్ రెడ్డి జయంతి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా కాగ్నా కళాసమితి ఉపాధ్యక్షులు సయ్యద్ యూసుఫ్, ముఖ్య వక్త అనంత సాహిత్య వేదిక వికారాబాద్ జిల్లా ఉపాధ్యక్షులు వడిచర్ల సత్యంతో పాటు పలువురు మాట్లాడుతూ 1926లోనే గోల్కొండ పత్రికను స్థాపించిన సురవరం ప్రతాప్ రెడ్డి పత్రికా సంపాదికుడిగా, రచయితగా, తెలంగాణ జాతి సాహితీ కీర్తిని దశదిశలా వ్యాపింపజేసిన స్ఫూర్తిదాయకుడి అని అభివర్ణించారు. తెలంగాణ ఆత్మగౌరవ పతాకాన్ని ఎగురవేసి అచ్చమైన తెలంగాణ వాది.. తేజో మూర్తిగా నిలుస్తున్నారని అన్నారు. నేటి యువత, సమాజం ఆయనను ఆదర్శంగా తీసుకుని ఆశయ సాధనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ కవులు కోటం చంద్రశేఖర్, కరణం మాణిక్ రావు, విజయ్ కుమార్.. సాహితీ వేత్తలు, పండితులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి…
సూపర్ పోలీస్..!
– నాలుగేళ్లుగా తప్పించుకు తిరుగుతున్న దొంగ
– చాకచక్యంగా పట్టుకున్న తాండూరు పోలీసులు
– డీఎస్పీ చేతుల మీదుగా రివార్డులు
https://dharshininews.com/17404
chaithany collage