విద్యకు సర్కారు పెద్దపీట

కెరీర్ తాండూరు రాజకీయం వికారాబాద్

విద్యకు సర్కారు పెద్దపీట
– జూనియర్ కాలేజీ అభివృద్ధికి కృషి
– తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి
– నూతన భవన నిర్మాణానికి భూమి పూజ
తాండూరు, దర్శిని ప్రతినిధి : తెలంగాణ సర్కారు విద్యకు పెద్దపీట వేస్తోందని తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి అన్నారు. శుక్రవారం తాండూరు పట్టణంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల నూతన భవన నిర్మాణానికి ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ప్రభుత్వం విద్యకు అధిక ప్రాధన్యత ఇస్తోందన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా గురుకులాలను ఏర్పాటు చేసి పేద విద్యార్థులకు కార్పోరేట్ స్థాయి విద్యను అందిస్తోందన్నారు. ఆంధ్రా పాలనలతో విద్యకు ప్రాధాన్యత ఉండేది కాదని, కోట్లాది సాధించుకున్న తెలంగాణలో పెద్దపీట వేయడం జరుగుతుందన్నారు. తాండూరులో రూ. 2 కోట్లతో ప్రభుత్వ జూనియర్ కళాశాల నూతన భవన నిర్మాణం చేపట్టడం జరుగుతుందన్నారు. కళాశాల అభివృద్ధికి తన వంతు కృషి ఉంటుందన్నారు. అదేవిధంగా తాండూరులో ఒకప్పుడు ఉన్న వలసలు పూర్తిగా తగ్గాయన్నారు. ఇప్పుడు తాండూరుకు ఇతర ప్రాంతాల నుంచి వలస వస్తున్నారని అన్నారు. తాండూరులో త్వరలో బైపాస్ రోడ్డు పనులు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్, నర్సింగ్ కాలేజీ పనులను పూర్తి చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో వికారాబాద్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజుగౌడ్, మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్, ఆర్డీఓ అశోక్ కుమార్, ఫ్లోర్ లీడర్ శోభారాణి, కౌన్సిలర్లు నీరజాబాల్ రెడ్డి, విజయదేవి, సంగీత ఠాకూర్, నాయకులు పట్లోళ్ల నర్సింలు, శ్రీనివాస్ చారి, ఇంటర్ బోర్డు అధికారి శంకర్ నాయక్, కాలేజీ ప్రిన్సిపల్, నేతలు తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి…
త్వరలో నా పెళ్లి..!
– నేను జైలుకు వెళ్లనంటే వెళ్లను
– కోర్టులో రిమాండ్‌ ఖైదీ హంగామా
– కోర్టులోనే తలుపు అద్దాలు ధ్వసం
https://dharshininews.com/17509

chaithany collage