సీఎంఆర్ఎఫ్ పేదల ఆరోగ్యానికి భరోసా
– ఉమ్మడి రంగా రెడ్డి జిల్లా ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి
– రూ.2.72లక్షల ఎల్ఓసీలను అందజేసిన ఎమ్మెల్సీ
తాండూరు, దర్శిని ప్రతినిధి : అనారోగ్యంతో ఆపదలో ఉన్న పేదలకు సీఎంఆర్ఎఫ్ పథకం భరోసా అందిస్తుందని ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి అన్నారు. సీఎంఆర్ఎఫ్ కింద తాండూరు పట్టణం విజయనగర్ కాలనీకి చెందిన జి. బుజ్జమ్మకు రూ. 1 లక్ష 25 వేలు, బషీరాబాద్ మండలం జీవనీ గ్రామానికి చెందిన కె. లక్ష్మీకి రూ. 1లక్ష, బి.అరుణమ్మకు రూ. 18వేలు, తాండూరు మండలం ఓగీపూర్ గ్రామానికి చెందిన శివకుమార్ కు రూ. 36 వేలు మంజూరు చేసింది. శనివారం తాండూరు పట్టణంలోని ఎమ్మెల్సీ నివాసంలో ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి లబ్దిదారులకు ఎల్ఓసీలను అందజేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి మాట్లాడుతూ అనారోగ్యంతో బాధపడే పేదలకు సీఎంఆర్ఎఫ్ పథకం ఆర్థిక చేయూతను అందిస్తుందన్నారు. ఈ పథకం పేదల ఆరోగ్యానికి భరోసాగా నిలుస్తుందని, అర్హులైన పేదలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ ఉమ్మడి జిల్లా డైరెక్టర్ రవీందర్ గౌడ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ వడ్డె శ్రీనివాస్, బీఆర్ఎస్ పట్టణ మాజీ అధ్యక్షులు అబ్దుల్ రవూఫ్, మాజీ డీపీసీ సభ్యులు పట్లోళ్ల నర్సింలు, నాయకులు సాయిపూర్ బాల్ రెడ్డి, కౌన్సిలర్ బోయ రవి, నాయకులు బోయరాజు, మాణిక్ రెడ్డి, బిర్కడ్ రఘు, అశోక్, వై. రాములు తదితరులు పాల్గొన్నారు.

