నగరేశ్వర దేవాలయానికి కొత్త పాలకవర్గం

తాండూరు రాజకీయం వికారాబాద్

నగరేశ్వర దేవాలయానికి కొత్త పాలకవర్గం
– దరఖాస్తుల ఆహ్వానానికి నోటీసులు జారీ
– గడువు ఎప్పటి వరకు అంటే
తాండూరు, దర్శిని ప్రతినిధి : వికారాబాద్‌ జిల్లా తాండూరు పట్టణంలోని నగరేశ్వర దేవాలయం కొత్త పాలకవర్గం ఏర్పాటుకు దేవాదాయ శాఖ కసరత్తు చేస్తోంది. ఈ మేరకు ధర్మకర్తల మండలి నియామకానికి దేవాదాయ శాఖ డిప్యూటి కమీషనర్ ఎం.రామకృష్ణ రావు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. దేవాదాయ శాఖ చట్టం సబ్‌ సెక్షన్‌-15 కింద అర్హుల నుంచి దరఖాస్తులను కోరుతున్నట్లు ఉత్తర్వులలో స్పష్టం చేశారు. ఆసక్తిగల వ్యక్తులు నోటీసు జారీ చేసిన తేది నుంచి 20 రోజుల్లోపు దరఖాస్తులను చేసుకోవాలని సూచించారు. చట్టంలోని సెక్షన్‌ -17లోని సబ్ సెక్షన్‌(3) కింద ఫారమ్-2 ను పూరించి దేవాదాయ శాఖ రంగారెడ్డి జిల్లా డిప్యూటి కమీషనర్‌ కార్యాలయానికి పంపాలని సూచించారు. ఆసక్తిగల ఆశావాహులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మరోవైపు ప్రస్తుతం దేవాలయ పాలకవర్గ చైర్మన్‌ గా పట్టణానికి చెందిన కుంచెం మురళీధర్ కొనసాగుతున్నారు. కొత్త పాలకవర్గ ధర్మకర్తల మండలి చైర్మన్‌గా ఎవరు నియామకం అవుతారనేది ఆసక్తిగా మారింది.

ఇది కూడా చదవండి…

పైలెట్ బర్త్ డే అదుర్స్‌..!

chaithany collage