పట్టణాభివృద్ధికి కృషి
– మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్
– 27వ వార్డులో సీసీ డ్రైన్, రోడ్డు పనులు ప్రారంభం
తాండూరు, దర్శిని ప్రతినిధి : పట్టణ అభివృద్ధికి కృషి చేయడం జరుగుతుందని తాండూరు మున్సిపల్ చైర్ పర్సన్ తాటికొండ స్వప్న పరిమళ్ అన్నారు. బుధవారం చైర్ పర్సన్ తన వార్డు 27లో చేపడుతున్న సీసీ డ్రైన్, సీసీ రోడ్డు పనులను ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ తాండూరు పట్టణంలోని వార్డుల్లో సమస్యలను దశల వారిగా పరిష్కరించడం జరుగుతుందన్నారు.
ఇందులో భాగంగా అవసరమైన చోట సీసీ డ్రైన్లు, రోడ్లు నిర్మించడం జరుగుతుందన్నారు. తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి సహాకారంతో అన్నివార్డులను అభివృద్ది పరిచి తాండూరును ఆదర్శంగా నిలుపుతామన్నారు. ఈ కార్యక్రమంలో కమీషనర్ విక్రమ్ సింహా రెడ్డి, మాజీ వైస్ చైర్మన్ సాజిద్ అలీ, కౌన్సిలర్లు బోయ రవి, బొంబీనా, మాజీ కౌన్సిలర్ జుబేర్ లాల, డీఈ ఖాజా హుస్సేన్, నాయకులు, కాలనీ వాసులు ఉన్నారు.
ఇదికూడా చదవండి…

