ఆరోగ్యానికి అగ్రతాంబూలం..!
– జిల్లాకొక మెడికల్ కాలేజీ మంజూరు
– తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి
– ఘనంగా వైద్య ఆరోగ్య దినోత్సవం
తాండూరు, దర్శిని ప్రతినిధి : తెలంగాణ ప్రజల ఆరోగ్యానికి సర్కారు అగ్రతాంబూలం అందించిందని తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి అన్నారు. తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా బుధవారం పట్టణంలోని భవాని ఫంక్షన్ హాల్లో వైద్య ఆరోగ్య దినోత్సవంను ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి హాజరై వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దేశంలోనే తెలంగాణ ప్రభుత్వం ఆదర్శవంతమైన ఆరోగ్య సేవలను అందించిందన్నారు. రాష్ట్రంలో ఆసుపత్రులు అభివృద్ధికి ప్రాధాన్యమిచ్చిందన్నారు. ప్రతీ జిల్లాకు ఒక మెడికల్ కళాశాలను మంజూరు చేసిన ఘనతగా సీఎం కేసీఆర్ సర్కారుకే దక్కిందన్నారు. దీంతోపాటు ఆరోగ్య కేంద్రాల అభివృద్ధిని చేపట్టిందన్నారు. పల్లె దవఖాలు, బస్తీ దవాఖానలతో పేదల ఆరోగ్యానికి భరోసా అందించిందన్నారు.
అదేవిధంగా డయాలిసిస్ రోగులకు ఆరోగ్య శ్రీ కింద ఉచిత డయాలిసిస్ అందిస్తుందన్నారు. ఇందుకు రూ. 6వేల కోట్లను ఖర్చును చేస్తుందన్నారు. గర్భిణీ మహిళలకు కేసీఆర్ కిట్, బాలింతలకు అమ్మఒడి పథకాలను అమలు చేస్తుందన్నారు. నూట్రిషన్ కిట్లను కూడా అందజేస్తుందన్నారు. మరోవైపు గర్భిణిలకు నూట్రీషన్ కిట్లను పంపిణీ చేశారు. అనంతరం వేడుకలలో భాగంగా వైద్యులను, వైద్య సిబ్బందిని సన్మానించారు. ఈ కార్యక్రమంలో వికారాబాద్ జిల్లా గ్రంథాలయ సంస్క ఛైర్మన్ రాజుగౌడ్, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు అప్పూ (నయూం), యాలాల ఎంపీపీ బాలేశ్వర్ గుప్త, పెద్దేముల్ ఎంపీపీ అనురాధ, జిల్లా ఆసుపత్రి సూపరిండెంట్ డా. రవిశంకర్, వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు, ఎఎస్ఎంలు, ఆశ వర్కర్లు తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి…


