గుడిలో పూజలు, దర్గా..చర్చిలో ప్రార్థనలు

తాండూరు రాజకీయం వికారాబాద్

గుడిలో పూజలు, దర్గా..చర్చిలో ప్రార్థనలు
– స్వయంగా పాల్గొన్న ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి
– దైవ కృపతోనే ప్రమాదం నుంచి రక్షణ : ఎమ్మెల్యే
– 1101 కొబ్బరి కాయలు కొట్టిన నేతలు, కార్యకర్తలు
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణంలోని పలు దేవాలయాల్లో, దర్గాలతో పాటు చర్చిలలో స్థానిక ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి పూజలు, ప్రార్థనలు చేశారు. శనివారం కర్ణాటక రాష్ట్రం మంగళూరు ఉడిపిలో జరిగిన కారు ప్రమాదం నుంచి క్షేమంగా బయటపడడం పట్ల ఆదివారం ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి పూజలు, ప్రార్థనల్లో పాల్గొన్నారు. పట్టణంలోని భావిగి భద్రేశ్వర దేవాలయంలో శివునికి ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పాతతాండూరులోని నిజాం షాహీ దర్గావద్దకు వెళ్లి ప్రార్థనలు చేశారు. నేతలతో కలిసి మొక్కు తీర్చుకున్నారు. అనంతరం పట్టణంలోని మెథడిస్ట్ చెర్చిలో పాస్టర్, క్రైస్తవ సోదరులతో కలిసి ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి మాట్లాడుతూ దైవ కృపతో పాటు తాండూరు నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదాలతో ఎలాంటి ప్రాణాపాయం లేకుండా క్షేమంగా బయట పడినట్లు పేర్కొన్నారు. దైవానుగ్రహం, ప్రజాభిమానం ఇలా మెండుగా ఉండాలని దేవుళ్లను ప్రార్థించినట్లు తెలిపారు. ఎమ్మెల్యే వెంట వికారాబాద్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజుగౌడ్, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు అపూ(నయూం), మున్సిపల్ మాజీ చైర్మన్ విశ్వనాథ్ గౌడ్, బీఆర్ఎస్ ఉపాధ్యక్షులు హరిగౌడ్, కౌన్సిలర్ వరాల శ్రీనివాస్ రెడ్డి, నాయకులు, కార్యకర్తలు, తదితరులు ఉన్నారు.

1101 కొబ్బరి కాయలతో మొక్కు
మరోవైపు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ప్రమాదం నుంచి క్షేమంగా బయటపడడం పట్ల తాండూరు నేతలు, కార్యకర్తలు 1101 కొబ్బరి కాయలు కొట్టి మొక్కు తీర్చుకున్నారు. ఆదివారం తాండూరు పట్టణం చంద్రథియేటర్ సమీపంలోని నూతన నివాసానికి వచ్చిన ఎమ్మెల్యే రోహెద్ రెడ్డికి నేతలు, కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు. గజమాల, పూలమాలలతో ఎమ్మెల్యేను సన్మానించారు.

అనంతరం రోడ్డు ప్రమాదం నుంచి క్షేమంగా తిరిగి రావడం పట్ల నూతన నివాసం గేటు వద్ద నేతలు, కార్యకర్తలు 1101 కొబ్బరి కాయలు కొట్టి మొక్కు తీర్చుకున్నారు. ఈ క్రమంలో నేతలు, కార్యకర్తలు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డికి అనుకూలంగా నినాదాలతో హోరెత్తించారు. దీంతో పాటు నియోజకవర్గంలోని తాండూరు పట్టణం, తాండూరు, యాలాల, బషీరాబాద్, పెద్దేముల్, కోట్ పల్లి మండలాల్లో నేతలు, ప్రజా ప్రతినిధులు, అభిమానులు, కార్యకర్తలు దేవాలయాలలో, పూజలు, మసీదుల్లో ప్రార్థనలు చేశారు.

ఇదికూడా చదవండి…

తాత తడబడలేదు..!

chaithany collage