ఫీవర్ సర్వేకు సహకరించాలి

ఆరోగ్యం తాండూరు వికారాబాద్

ఫీవర్ సర్వేకు సహకరించాలి
– 20వ వార్డు కౌన్సిలర్ సంగీత అజయ్ సింగ్ ఠాకూర్
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి : కరోనా నియంత్రణలో భాగంగా నిర్వహిస్తున్న ఫీవర్ సర్వేకు అందరు సహకరించాలని తాండూరు మున్సిపల్ 20వ వార్డు కౌన్సిలర్ సంగీతా అజయ్ సింగ్ ఠాకూర్ అన్నారు. శుక్రవారం వార్డులోని గాంధీనగర్ లో చేపట్టిన ఫీవర్ సర్వేలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక బృందంతో కలిసి ఇంటింటికి తిరిగారు. వార్డులో వ్యాక్సినేషన్ తీసుకోని వారితో పాటు జ్వరం, జలుబు, దగ్గు లక్షణాలు ఉన్న వారి వివరాలను పరిశీలించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ కరోనా నియంత్రణ కోసం చేపట్టిన సర్వేకు అందరు సహకరించాలని అన్నారు. లక్షణాలను ఉన్న వారు మెడికల్ కిట్లను తీసుకుని సద్వినియోగం చేసుకోవాలన్నారు. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వం ద్వారా ఉచితంగా అందజేస్తున్న కరోనా వ్యాక్సినేషన్ను అర్హులందరు వేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ ఆఫీసర్ మహేష్, ఆర్సీ శోభ, ఆశ వర్కర్ సుజాత, అంగన్వాడి టీచర్ రాధా, ఏఎస్ఎం తదితరులు పాల్గొన్నారు.