పైలెట్‌కు ఫొటో షూట్ చిక్కు..!
– వివాదాస్పమైన వీడియో
– కొట్టిపారేసిన ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి : వికారాబాద్ జిల్లా తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డికి ఓ ఫొటో షూట్ చిక్కులు తెచ్చింది. ఆయనకు కేటాయించిన వై సెక్యూరిటీతో ఫోటోషూట్ చేసిన వీడియో వైరల్ కావడంతో వివాదాస్పదానికి కారణమైంది. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ఫిర్యాదు దారుడిగా ఉన్న రోహిత్ రెడ్డికి వై కేటగిరి సెక్యూరిటీని తెలంగాణ ప్రభుత్వం కల్పించిన సంగతి తెలిసిందే. తాండూరు పట్టణంలోని గత 11 రోజులుగా ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి శ్రీ రాజ శ్యామల, శతచండి, అతిరుద్ర మహాయాగంలో పాల్గొంటున్నారు. బుధవారం ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి తనకు కేటాయించిన సెక్యూరిటీ సిబ్బందితో ఉన్నట్లు ఆయన అనుచరులు ఫోటోషూట్ తీశారు. గురువారం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో పైలెట్ రోహిత్ రెడ్డి సెక్యూరిటిని ఫోటోషూట్‌కు వాడుకోవడం వివాదాస్పదంగా మారింది.
భద్రత కోసం కల్పించిన సెక్యూరిటీతో విచ్చలవిడిగా రోహిత్‌రెడ్డి ఫోటోషూట్లు పాల్పడుతున్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రైవేటు పార్టీలు, పబ్బుల్లోనూ సెక్యూరిటీతో రోహిత్ హల్‌చల్ చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. మరోవైపు వివాదాస్పద సంఘటనపై ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి స్పందించారు. తన వెనుక ఉన్న అనుచరులు అభిమానంతో వీడియో తీశారని, సోషల్ మీడాయాలోని స్నాప్ చాట్, ఇతర యాప్‌లను ఉపయోగించి హంగులు అద్ది వీడియో రూపొందించారని అన్నారు. సాధారణంగా సెక్యూరిటీ వెనుకాల, పక్కన నడుస్తున్నప్పుడు మాత్రమే వీడియో తీసి యాప్‌ల ద్వారా ఎడిటింగ్ చేశారని అన్నారు. ప్రధాని మోడీ లాగా కెమరాలను పెట్టి తీయించుకోలేదని, పీఎం స్థాయిలో పోల్చుకున్నారు. అయినా ఇదింతా చిచ్చోరా ప్రచారం.. తాను పట్టించుకోవడంలేదని కొట్టి పారేశారు.
ఇది కూడా చదవండి…


