కథలు చెబితే.. ప్రైజ్ ఇస్తాం..!

కెరీర్ తాండూరు రాజకీయం వికారాబాద్

కథలు చెబితే.. ప్రైజ్ ఇస్తాం..!
– 24న నేతాజీలో నీతి కథల పోటీలు
– జూనియర్, సీనియర్ విద్యార్థులకు అవకాశం
– తాండూరులో గోడపత్రిక ఆవిష్కరణ
తాండూరు, దర్శిని ప్రతినిధి : అవును కథలు చెబితే.. నగదు ప్రైజ్‌ ఇస్తామని తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) హిందూ ధర్మ ప్రచార పరిషత్ కోఆర్డినేటర్ హరినాథ్ తెలిపారు. ఈనెల 24 నుంచి తాండూరులో విద్యార్థులకు నీతి కథల పోటీలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. మంగళవారం తాండూరు పట్టణంలోని నేతాజీ గురుకుల్ హై స్కూల్లో ఈ పోటీలకు సంబంధించిన గోడపత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా హరినాథ్ మాట్లాడుతూ తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో ‘కథ చెబుతారా… ఊ కొడుతాం..!’ అనే కార్యక్రమం ద్వారా విద్యార్థులకు నీతి కథల పోటీలు నిర్వహించడం జరుగుతుందన్నారు. తాండూరులోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల విద్యార్థులకు ఈనెల 24వ తేదిన ఉదయం 11 గంటల నుంచి పట్టణంలోని శ్రీ నేతాజీ గురుకుల్ హై స్కూల్లో పోటీలు జరుగుతాయన్నారు.

రామాయణం, భాగవతం, భారత, చారిత్రాత్మికమైన కథల నుంచి పోటీలు నిర్వహించడం జరుగుతుందన్నారు. 5 ఏండ్ల నుంచి 10 ఏండ్ల లోపు జూనియర్స్ విద్యార్థులకు, 10 ఏండ్ల నుంచి 15 ఏండ్లలోపు సీనియర్ విద్యార్థులు పోటీలో పాల్గొంటారని, 2 నుంచి 5 నిమిషాలలో కథలు చెప్పాల్సి ఉంటుందన్నారు. ఈ పోటీలో విజేతలుగా నిలిచిన వారికి మొదటి బహుమతి రూ.1000, రెండో బహుమతి రూ. 750, మూడో బహుమతి కింద రూ.500లు అందజేయడం జరుగుతుందన్నారు. పూర్తి వివరాలకు సెల్: 9030850336లకు సంప్రదించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో శ్రీ నేతాజీ గురుకుల్ హై స్కూల్ డైరెక్టర్ మణిమాల, ప్రిన్సిపల్ శివలాల, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి…

పాన్‌తో ఆధార్‌ లింకు చేయకుంటే అంతే..!

chaithany collage