ఎస్బీఐలో బెస్ట్ స్కీం..!

కెరీర్ జాతీయం టెక్నాలజీ తెలంగాణ మహబూబ్ నగర్ రంగారెడ్డి లైఫ్-స్టైల్ వికారాబాద్ హైదరాబాద్

ఎస్బీఐలో బెస్ట్ స్కీం..!
– 400 రోజులకు 7.1 శాతం వడ్డీ
– గడువు ఆగస్టు 15 వరేకే
దర్శిని డెస్క్‌: దేశంలోనే అతిపెద్ద బ్యాంక్ అయిన ఎస్‌బీఐ బ్యాంకు ఖాతాదారులకు బెస్ట్ స్కీం అమలు చేస్తోంది. వారికి మరింత లబ్దిచేకూరే ఈ పథకాన్ని ఆగస్టు 15 వరకు పొడగించింది. ‘ఎస్‌బీఐ’ (SBI) గత కొన్ని నెలలుగా ఫిక్స్‌డ్ డిపాజిట్‌కి సంబంధించిన అమృత్‌ కలశ్‌ స్కీమ్ అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇది ఒకరకమైన షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్‌‌మెంట్. దీని ద్వారా మంచి వడ్డీ పొందవచ్చు. తక్కువ కాలంలో మంచి వడ్డీ కావాలనుకునే వారికి ఇది మంచి స్కీమ్ అనే చెప్పాలి. అయితే ఈ పథకం 2023 జూన్ 30 నాటికి ముగిసింది. కానీ ఇప్పుడు దీని గడువుని 2023 ఆగష్టు 15కి పెంచింది. అంటే ఈ స్కీమ్ ఇక కొన్ని రోజులు మాత్రమే అందుబాటులో ఉంటుంది.

అమృత్ కలశ్ డిపాజిట్‌ స్కీ వివరాలు
ఈ స్కీం డిపాజిట్ పిరియడ్ – 400 రోజులుగా ఉంటుంది. ఈ స్కీమ్‌ కింద సీనియర్‌ సిటిజన్లకు 7.6 శాతం, మిగిలిన వారికి 7.1 శాతం వడ్డీరేటు లభిస్తుంది.

ఆదాయ పన్ను చట్టం ప్రకారం వడ్డీపై మూలం వద్ద పన్ను (TDS) కోత ఉంటుంది. ఎస్‌బీఐ శాఖలు, ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌, ఎస్‌బీఐ యోనో యాప్‌ ద్వారా ఈ ప్రత్యేక ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ స్కీమ్‌ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. రూ.2 కోట్లలోపు మొత్తాలకు ఈ స్కీమ్‌ వర్తిస్తుంది. అమృత్ కలశ్ డిపాజిట్ కోసం ప్రత్యేకంగా ఎలాంటి ప్రొడక్ట్ కోడ్స్ అవసరం లేదు. వడ్డీ, నికర టీడీఎస్ కస్టమర్ ఖాతాలో జమవుతాయి. ఆదాయ పన్ను చట్టం ప్రకారం టీడీఎస్ రేటు వర్తిస్తుంది. రిటైల్ టర్మ్ డిపాజిట్ వర్తింపు విధంగా విత్‌డ్రా చేసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఈ స్కీంలో లోన్ ఫెసిలిటీ అందుబాటులో ఉంది. బ్రాంచ్/ఐఎన్‌బీ/యోనో మార్గాల ద్వారా లోన్ తీసుకోవచ్చు.

ఇది కూడా చదవండి…

పాన్‌తో ఆధార్‌ లింకు చేయకుంటే అంతే..!

chaithany collage