కమలంలోకి పీఎల్ఆర్‌..?

తాండూరు రాజకీయం వికారాబాద్

కమలంలోకి పీఎల్ఆర్‌..?
– చేరికకు ముహూర్తం ఖరారైట్లే
– కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి, డీకే అరుణతో మంతనాలు
– పార్టీలో చేరేందుకు కండిషన్ పెట్టిన లక్ష్మారెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు నియోజకవర్గ సీనీయర్ నాయకులు, డీసీసీబీ మాజీ చైర్మన్, మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ రుద్రారం లక్ష్మారెడ్డి కారు దిగి కమలం చేరేందుకు నిర్ణయించుకున్నారు. ఓ ప్రముఖ పత్రికలో ఈ కథనం ప్రచురించింది. రాజకీయంగా సుధీర్ఘ కాలం పనిచేసిన లక్ష్మారెడ్డి గత శాసనసభ ఎన్నికల్లో కాంగ్రె్‌సను వీడి బీఆర్‌ఎ్‌సలో చేరారు. సర్పంచ్‌, మున్సిపల్‌ చైర్మన్‌, డీసీసీబీ చైర్మన్‌గా పని చేసిన ఆయన గత ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఎమ్మెల్యే టికెట్‌ ఆశించి భంగపడ్డారు. ప్రస్తుతం బీఆర్‌ఎస్ పార్టీలో ఉన్న లక్ష్మారెడ్డి బీజేపీలో చేరేందుకు ఆపార్టీ నేతలు, తన అనుచరులతో సమావేశమవుతున్నట్లు ప్రచారం జరిగింది.

ఒకరోజు క్రితం హైదరాబాద్‌లో మాజీ ఎమ్మెల్సీ మాగంరంగారెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఆకుల రాజేందర్‌ తోపాటు లక్ష్మారెడ్డి, మాజీ మంత్రి డీకే అరుణతో భేటీ అయ్యారు. కేంద్రమంత్రి అమిత్‌షా సమక్షంలో బీజేపీలో చేరేందుకు డీకే అరుణ ఒప్పించారు. కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డితో లక్ష్మారెడ్డి ఫోన్‌లో మాట్లాడారు. నేడో, రేపో కిషన్‌రెడ్డితో భేటీ కానున్నారు. అయితే లక్ష్మారెడ్డి పార్టీలో చేరేందుకు ఒక కండిషన్ పెట్టినట్లు తెలిసింది. వచ్చే ఎన్నికల్లో తాండూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా తనకు అవకాశం ఇవ్వాలని కోరినట్లు సమాచారం. ఈనెల 29న బీజేపీలో అమిత్‌షా సమక్షంలో మాజీ ఎమ్మెల్సీ మాగం రంగారెడ్డి, ఎమ్మెల్సీ ఆకుల రాజేందర్‌తో పాటు డీసీసీబీ మాజీ చైర్మన్‌ లక్ష్మారెడ్డి చేరుతున్నారని మాజీ మంత్రి డీకె అరుణ చెప్పారు. మరోవైపు లక్ష్మారెడ్డి పార్టీ మారే నిర్ణయం పట్ల మంత్రి సబితారెడ్డి, ఎంపీ రంజిత్‌రెడ్డి ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డిలు వ్యతిరేకించినట్లు తెలిసింది. పార్టీలో సముచిత స్థానం ఉంటుందని, కావున పార్టీ మారోద్దని ఒత్తిడి చేసినట్లు తెలిసింది.

ఇది కూడా చదవండి…

పాన్‌తో ఆధార్‌ లింకు చేయకుంటే అంతే..!

chaithany collage