జావిద్ భాయ్.. జోరు..!
– కాలనీ సమస్యల పరిష్కారంపై ఫోకస్
– రాజీవ్, ఇందిరమ్మ కాలనీలో పర్యటన
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణం రాజీవ్ కాలనీ, ఇందిరమ్మ కాలనీల కౌన్సిలర్ జావిద్ భాయ్ జోరు పెంచారు.

ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తరుపున పోటీ చేసిన జావిద్ 800 ఓట్ల పైచిలుకు మెజార్టీతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. రేపు కౌన్సిలర్‌గా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అయితే కౌన్సిలర్‌గా గెలిచిన జావిద్ కాలనీల సమస్యలపై ఫోకస్ పెట్టారు. హైదరాబాద్ రోడ్డు మార్గంలో సెంట్రల్ లైటింగ్ లైట్లు పడకపోవడంతో స్థానికులు ఆయన దృష్టికి తీసుకెళ్లారు.

దీంతో ఆయన మున్సిపల్ సిబ్బందితో కలిసి పరిశీలించారు. మరమ్మత్తులు చేయించేందుకు దృష్టిసారించారు. అదేవిధంగా ఉదయం ఇందిరమ్మ కాలనీలో పర్యటించారు. పారిశుద్ధ్య పనులు పరిశీలించారు. కాలనీలో మురుగు కాలువ పరిశుభ్రత పనులు చక్కగా చేయాలని సిబ్బందికి సూచించారు. ఆయన వెంట కాలనీ పెద్దలు, యువకులు ఉన్నారు.

