రైతులకు శుభవార్త..!
– రైతు రుణమాఫీకి గ్రీన్ సిగ్నల్
– రేపటి నుంచే రాష్ట్ర వ్యాప్తంగా అమలు
– ఆదేశించిన సీఎం కేసీఆర్
హైదరాబాద్, దర్శిని ప్రతినిధి : తెలంగాణ రాష్ట్రంలోని రైతులకు సీఎం కేసీఆర్ సర్కారు శుభవార్త చెప్పింది. రైతులకు రేపటి నుంచి రైతు రుణమాఫీ అమలు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. బుధవారం అధికారులతో సమీక్ష జరిపిన సీఎం కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ నోట్ల రద్దు, కరోనా కారణంగా రైతు రుణాల మాఫీ ఆలస్యం అయిందని సీఎం కేసీఆర్ ఈ సందర్భంగా ప్రకటించారు. తొలి విడతలో 19 వేల కోట్ల రుపాయల రుణాల మాఫీ చేయనున్నట్లు తెలిపారు. ఇది రేపటినుంచే అమలు చేయాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. దీనికి సంబంధించి వ్యవసాయ శాఖ ఇప్పటికే డ్రాఫ్ట్ సిద్ధం చేసింది. సెప్టెంబర్ వరకు విడతల వారిగా రైతులకు రుణాల మాఫీ చెక్కులను పంపిణీ చేయనున్నారు. సెప్టెంబరు రెండో వారం వరకు చెక్కులు పంపిణీ పూర్తికానుంది. గ్రామాల వారీగా, మండలాలు, జిల్లాలు వారీగా రైతుల బ్యాంకు రుణాలు, వాటికి సంబంధించిన వివరాలన్నీ ఇప్పటికే అధికారులు సేకరించారు. సీఎం కేసీఆర్ ఆదేశాలతో తెలంగాణ వ్యాప్తంగా రూ. లక్ష రూపాయల రుణ మాఫీ అమలు కానుంది.
ఇది కూడా చదవండి…

