బర్త్ డే ర్యాలీపై సీరీయస్
– అనుమతి లేకుండా నిర్వహణ
– చర్యలకు సిద్దమైన పట్టణ పోలీసులు
తాండూరు, దర్శిని ప్రతినిధి: వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఓ నాయకుడు నిర్వహించిన బర్త్ డే ర్యాలీపై పోలీసు శాఖ సీరీయస్ అయ్యింది. అనుమతులు లేకుండా నిర్వహించిన ర్యాలీలో ఓ బాలుడు జనరేటర్ ట్రాలీ కింద పడి పరిస్థితి విషమంగా మారిన సంగతి తెలిసిందే. వివరాల్లోకి వెళితే.. తాండూరు మున్సిపల్ పరిధి పాత తాండూరుకు చెందిన బీఆర్ఎస్ యువ నాయకులు అబ్రార్ లాల జన్మదిన వేడుకల సందర్బంగా హైదరాబాద్ నుంచి పంజాగుట్ట ఫయాజ్‌ను ఆహ్వానించారు. మంగళవారం రాత్రి ఆయనకు స్వాగతం పలికేందుకు పట్టణంలోని విలియమూన్ చౌరస్తా నుంచి సౌండ్ సిస్టమ్‌ను ఏర్పాటు చేశారు. ట్రాక్టర్‌ను అనుసంధానంగా జనరేటర్ ట్రాలీనీ కూడా ఏర్పాటు చేసుకున్నారు.
అక్కడి నుంచి ర్యాలీ ఇందిరా చౌరస్తా వైపు ప్రారంభమయ్యింది. అదే సమయంలో పట్టణంలోని రహెమత్ నగర్ మునావర్ కుమారుడు రెహాన్(14) చౌరస్తా వైపు సైకిల్‌పై వెళుతుండగా ప్రమాద వశాత్తు రెహాన్ ర్యాలీలో సౌండ్ సిస్టమ్ కోసం ఏర్పాటు చేసుకున్న జనరేటర్ ట్రాలీ కింద పడిపోయాడు. రెహాన్ పైనుంచి ట్రాలీ దూసుకెళ్లినట్లు స్థానికులు తెలిపారు. అయితే బర్తే డే సందర్భంగా నిర్వహించిన ర్యాలీకి, సౌండ్ సిస్టమ్‌కు ఎలాంటి అనుమతులు లేవని పోలీసులు నిర్దారించారు. అనుమతులు లేకుండా సౌండ్ సిస్టమ్‌తో ర్యాలీ నిర్వహించడంతో పాటు బాలుడు సంఘటనపై సీరీయస్‌గా తీసుకున్నట్లు పట్టణ సీఐ రాజేందర్ రెడ్డి తెలిపారు. ఈ సంఘటనపై బాధ్యులపై చర్యలు తీసుకుంటామని అన్నారు.
ఇది కూడా చదవండి…

