దూసుకొచ్చిన మృత్యువు..!

క్రైం తాండూరు రాజకీయం వికారాబాద్

దూసుకొచ్చిన మృత్యువు..!
– వెనకనుంచి బైకును ఢీ కొట్టిన టిప్పర్
– ఒకరి మృతి, ఇద్దరికి గాయాలు
– వికారాబాద్ జిల్లా తాండూరులో ఘటన 
తాండూరు, దర్శిని ప్రతినిధి : బైకుపై వెళుతున్న యువకులపైకి వెనకనుంచి ఓ టిప్పర్ లారీ మృత్యువు రూపంలో దూసుకొచ్చింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్ర గాయాలపాలయ్యారు. వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో బుధవారం తెల్లవారు జామున ఈ సంఘటన చోటు చేసుకుంది. బాధితుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. యాలాల మండలం హాజీపూర్ గ్రామానికి చెందిన కృష్ణ బుధవారం హైదరాబాద్ లో పరీక్ష రాయాల్సి ఉంది. ఇందుకోసం అదే మండలం దౌల్తాబాద్ గ్రామానికి చెందిన లాలప్ప బైకుపై కృష్ణ, మరో యువకుడు నరేష్ తో కలిసి తెల్లవారు జామున తాండూరుకు వస్తున్నారు.

 

పట్టణ సమీపంలోకి రాగానే ఫ్లైఓవర్ వద్ద ఉన్న పెట్రోల్ బంకు నుంచి బయటకి వస్తున్నా టిప్పర్ ముందు వెళుతున్నా లాలప్ప బైకుని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో లాలప్పకు తీవ్ర గాయాలు కావడంతో మృతి చెందాడు. కృష్ణ, నరేష్ లకు తీవ్ర గాయాలు అయ్యాయి. స్థానికులు గాయపడిన వారిని చికిత్స నిమిత్తం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

 

 

ఇది కూడా చదవండి…

పాన్‌తో ఆధార్‌ లింకు చేయకుంటే అంతే..!