రంజిత్‌రెడ్డి సేవా నిరతి ఎంతో గొప్పది
– మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్
తాండూరు, దర్శిని ప్రతినిధి: చేవేళ్ల పార్లమెంట్ సభ్యులు గడ్డం రంజిత్‌రెడ్డి సేవా నిరతి ఎంతో గొప్పదని తాండూరు మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ అన్నారు. రంజిత్‌రెడ్డి తన జన్మదినం సందర్భంగా గిప్ట్ ఏ స్మైల్ కార్యక్రమంలో భాగంగ తాండూరుకు చెందిన అన్వర్‌కు స్కూటీని అందజేశారు. ఆదివారం స్కూటీని తాళాన్ని చైర్ పర్సన్ స్వప్న అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చేవేళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి పేదల కోసం ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టారని, దివ్యాంగులకు వాహనాలు అందించాలనే ఆయన సేవా నిరతి ఎంతో గొప్పదన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ సీనీయర్ నాయకులు జుబేర్‌లాల, కౌన్సిలర్లు వెంకన్నగౌడ్, ముక్తార్ నాజ్, బోయరవి తదితరులు ఉన్నారు.

