పాతకుంట పార్కుకు కొత్త రూపు..!

తాండూరు రాజకీయం వికారాబాద్

పాతకుంట పార్కుకు కొత్త రూపు..!
– రూ.6కోట్లతో థీమ్ పార్కుగా ఆధునీకరణ
– ప్రారంభించిన వైస్ చైర్ పర్సన్ దీపా నర్సింలు
తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరు మున్సిపల్ పరిధిలోని పాత కుంట పార్కు కొత్త రూపు దిద్దుకోబోతుంది. స్థానిక ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి సహాకారంతో 12వ వార్డులోని పాతకుంటలో థీమ్ పార్కును ఏర్పాటు చేయబోతున్నారు. ఇందుకు టఫ్ ఐడీసీ నుంచి రూ. 6 కోట్లు నిధులు కూడా కేటాయించారు. సోమవారం తాండూరు మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ పట్లోళ్ల దీపా నర్సింలు వార్డు కౌన్సిలర్ పూజా రజనీకాంత్ తో కలిపి పార్కు అభివృద్ధి పనులను ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి సహాకారంతో పాత కుంట పార్కుకు మహర్దశ వచ్చిందన్నారు. రూ. 6 కోట్లతో థీమ్ పార్కుగా సుందరీకరణ చేయడం జరుగుతుందన్నారు. సాయిపూర్, శాంతినగర్ ప్రజలకు పార్కు అందుబాటులోకి వస్తుందన్నారు. థీమ్ పార్కులు వాకింగ్ ట్రాక్, ఆట వస్తువులు, ఇతర సౌకర్యాలు కల్పించడం జరుగుతుందన్నారు. మురుగు మయంగా ఉన్న పాత కుంటకు థీమ్ పార్కుతో కొత్త రూపు సంతరించుకుంటుందని అన్నారు.

ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు విజయదేవి, పదాల శ్రీనివాస్ రెడ్డి, సోమశేఖర్, సీనియర్ నాయకులు రంగారావు, బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి సంతోష్ గౌడ్, ఎర్రం శ్రీధర్, బీజేపీ అసెంబ్లీ కన్వినర్ రజనీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి…

పాన్‌తో ఆధార్‌ లింకు చేయకుంటే అంతే..!