రెండు రోజులు భారీ వర్షాలు..!

తెలంగాణ మహబూబ్ నగర్ రంగారెడ్డి రాజకీయం వికారాబాద్ హైదరాబాద్

రెండు రోజులు భారీ వర్షాలు..!
– ప్రకటించిన వాతావవరణ శాఖ
– జిల్లాలకు ఎల్లో, గ్రీన్ అలెర్టులు
హైదరాబాద్, దర్శిని ప్రతినిధి: తెలంగాణ రాష్ట్రంలో నేడూ, రేపూ రెండు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ మేరకు వాతావరణ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. ‘వాయవ్య బంగాళాఖాతం, పరిసర ప్రాంతాల్లో అల్పపీడన ద్రోణి ఏర్పడడంతో సముద్రమట్టానికి 7.6 కి.మీ. ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఒడిశా, పశ్చిమబెంగాల్‌ తీరాలను ఆనుకుని ఉన్న వాయవ్య బంగాళాఖాతంలో గురువారం ఏర్పడిన అల్పపీడనం చురుగ్గా ఉంది. రెండు, మూడు రోజుల్లో అది పశ్చిమ వాయవ్య దిశలో ఉత్తర ఒడిశా-ఉత్తర ఛత్తీస్‌గఢ్‌ వైపు వెళ్లే అవకాశముంది. దీని ప్రభావంతో రాబోయే రెండు రోజులపాటు ఆదిలాబాద్‌, కుమురంభీమ్‌-ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, నిజామాబాద్‌, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్‌, పెద్దపల్లి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి అని వాతావరణ శాఖ పేర్కొంది.

అదేవిధంగా పలు జిల్లాలకు వాతావరణ శాఖ అధికారులు ఎల్లో అలర్ట్‌లు జారీ చేశారు. ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, నిర్మల్‌, మంచిర్యాల, నిజామాబాద్‌, జగిత్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, సిరిసిల్ల, కరీంనగర్‌, ములుగు, కొత్తగూడెం, సంగారెడ్డి, మల్కాజ్‌గిరి, హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లాలకు అధికారులు ఎల్లో అలర్ట్‌ జారీ చేశారు. కామారెడ్డి, మెదక్‌, సిద్దిపేట, హన్మకొండ, వరంగల్‌, జనగాం, భువనగిరి, మహబూబాబాద్‌, ఖమ్మం, సూర్యాపేట, నల్గొండ, నాగర్‌కర్నూల్‌, వనపర్తి, మహబూబ్‌నగర్‌, వికారాబాద్‌, నారాయణపేట్‌, గద్వాల్‌ జిల్లాల్లో గ్రీన్‌ అలర్ట్‌ ప్రకటించారు.

ఇది కూడా చదవండి…

పాన్‌తో ఆధార్‌ లింకు చేయకుంటే అంతే..!