రోహితన్నకు బంపర్ మెజార్టీ గిఫ్ట్ ఇస్తాం
– గాంధీనగర్‌లో గులాబీ నేతల సంబరాలు
– పైలెట్‌కు టిక్కెట్టు కేటాయింపుపై హర్షం
తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డికి వచ్చే ఎన్నికల్లో బంపర్ మెజార్టీ గిఫ్టు అందిస్తామని తాండూరు పట్టణ నాయకులు అన్నారు. సోమవారం తాండూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా బీఆర్ఎస్ పార్టీ టిక్కెట్ రావడంపై సంబరాలు జరుపుకున్నారు. పట్టణంలోని గాంధీనగర్‌లో బీఆర్ఎస్ పట్టణ ప్రధాన కార్యదర్శి సంతోష్ గౌడ్ ఆధ్వర్యంలో ఈ సంబరాలు నిర్వహించారు. ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సంతోష్ గౌడ్ మాట్లాడుతూ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి తాండూరు నియోవర్గ టికెట్ కేటాయించడం పట్ల సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. రెండోసారి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న రోహిత్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు. వచ్చే ఎన్నికల్లో పైలెట్ రోహిత్ రెడ్డికి బంపర్ మెజార్టీ అందించి గిఫ్ట్ అందిస్తామని, రోహిత్ రెడ్డి మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బీసీ సెల్ పట్టన ప్రధాన కార్యదర్శి చంటి యాదవ్, గాంధీనగర్ ప్రజలు సాగర్, ప్రశాంత్, నగేష్, సాయి, శ్రీను,భాను, చింటూ, నవీన్ తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి…

