గెల్లు శ్రీనివాస్‌ యాదవ్‌తో బీఆర్ఎస్వీ నేతల భేటీ

తాండూరు రాజకీయం వికారాబాద్

గెల్లు శ్రీనివాస్‌ యాదవ్‌తో బీఆర్ఎస్వీ నేతల భేటీ
– టూరిజం చైర్మన్‌తో విద్యారంగ సమస్యలపై చర్చ
– తాండూరు బహిరంగ సభకు రావాలని విజ్ఞప్తి
తాండూరు, దర్శిని ప్రతినిధి : తెలంగాణ రాష్ట్ర టూరిజం కార్పోరేషన్ చైర్మన్, బీఆర్ఎస్ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షులు గెల్లు శ్రీనివాస్ యాదవ్‌తో తాండూరు బీఆర్ఎస్ విద్యార్థి విభాగం నాయకులు భేటి అయ్యారు. మంగళవారం రాష్ట్ర టూరిజం కార్పోరేషన్ కార్యాలయంలో విద్యార్థి విభాగం ఇంచార్జ్ జిలానీ, తాండూరు పట్టణ అధ్యక్షులు సందీప్ రెడ్డి, ఉపాధ్యక్షులు ఆకీబ్, ప్రధాన కార్యదర్శి, నాసిర్ ఖాన్, కార్యదర్శి పోహెబ్ తదితరులు మర్యాదపూర్వకంగా కలిశారు. తెలంగాణ టూరిజం కార్పోరేషన్‌ చైర్మన్‌గా నియామకం కావడం పట్ల బీఆర్ఎస్‌ విద్యార్థి విభాగం తరుపున శుభాకాంక్షలు తెలిపారు. అదేవిధంగా తాండూరులోని విద్యారంగ సమస్యల పరిష్కారంపై చైర్మన్‌తో చర్చించారు. తాండూరులో త్వరలో నిర్వహించే బీఆర్ఎస్వీ బహిరంగ సభకు హాజరుకావాలని గెల్లు శ్రీనివాస్ యాదవ్ ను కోరారు. ఇందుకు ఆయన సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ యువనాయకులు రజక నరసింహా, నాయకులు వెంకటయ్య యాదవ్ తదితరులు ఉన్నారు.

ఇది కూడ చదవండి…

పేద విద్యార్థుల సేవలో..!