నమోః వేంకటేశా..!

తాండూరు రాజకీయం వికారాబాద్

నమోః వేంకటేశా..!
– వైభవంగా స్వామి విగ్రహ ప్రతిష్టాపన
– మార్మోగిన ఖాంజాపూర్‌ గేటు
తాండూరు, దర్శిని ప్రతినిధి : ఓం నమోః వేంకటేశ, నమోః శ్రీనివాసా అంటూ నామస్మరణతో తాండూరు పట్టణం హైదరాబాద్ రోడ్డు మార్గంలోని ఖాంజాపూర్ గేటు ప్రాంతం మార్మోగింది. ఆదివారం సివిల్‌ సప్లయ్ గోదాం సమీపంలో ఉన్న శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయంలో వేంకటేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్టాపన వైభవంగా జరిగింది. రాజీవ్‌ కాలనీకి చెందిన ప్రముఖ రిటైర్డ్ హెచ్ఎం రేషం బిచ్చప్ప, విజయలక్ష్మీ దంపతుల ఆధ్వర్యంలో వేంకటేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం నిర్వహించారు. ప్రతిష్టాపన సందర్భంగా ఆలయంలో హోమం, నవ గ్రహ పూజ కార్యక్రమాలు కూడా నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్చరణల మద్య వెంకటేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్టాపన జరిగింది. ఈ క్రమంలో భక్తులు శ్రీనివాసుని నామం జపించడంతో ప్రాంతం స్వామి నామసర్మరణ మార్మోగింది. అదేవిధంగా విగ్రహ ప్రతిష్టాపన సందర్భంగా ఆలయంలో భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కందనెల్లి, రాజీవ్ కాలనీ, ఖాంజాపుర్, తాండూరు భక్తులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి…

గ్రామీణ రోడ్లకు కొత్త శోభ..!