ఏపీపీ పోస్టుకు తాండూరు న్యాయవాది అర్హత
– పోస్టు అందుకోబోతున్న గోసాయి సుధాకర్
తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి: అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసీక్యూటర్(ఏపీపీ) పోస్టుకు తాండూరు మండలం ఖాంజాపూర్ గ్రామానికి చెందిన న్యాయవాది గోసాయి సుధాకర్ ఎంపికై అర్హత సాధించారు. తెలంగాణలో అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోస్టుల భర్తీ పరీక్షల్లో పాల్గొన్న గోసాయి సుధాకర్ ఉత్తీర్ణత సాధించారు. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు ఆయనకు ఇంటిమేషన్ లెటర్‌ను పంపించింది.
వచ్చేనెల డిసెంబర్ 1వ తేదీన హైదరాబాద్ లోని రాజాబహదూర్ వెంట్రమారెడ్డి తెలంగాణ పోలీసు పోలీసు అకాడమిలో సర్టిఫికెట్ వెరిఫికేషన్ అనంతరం పోస్టింగ్ ఇవ్వనున్నారు. ఈ విషయాన్ని న్యాయవాది గోసాయి సుధాకర్ స్వయంగా దృవీకరించారు. గత కొన్నేండ్ల నుంచి గోసాయి సుధాకర్ తాండూరు మున్సిప్ కోర్టులో న్యాయవాదిగా కొనసాగుతున్నారు. మరోవైపు అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా అర్హత సాధించిన గోసాయి సుధాకర్‌ను ఖాంజాపూర్ గ్రామస్తులు శివకుమార్, మహేందర్, వెంకటేష్, బస్వరాజ్, సురేందర్, శ్రీనివాస్, శాంతకుమార్, తోటి న్యాయవాదులు నాదిర్గె సుదర్మన్, రవీందర్, జిలాని, ఆంజనేయులు, మద్దత, అరుణ, జిలాని తదితరులు అభినందించి సన్మానించారు.
