సారీ.. సర్దార్..!
– పటేల్ ఫోటో లేకుండా విమోచన దినం
– తాండూర్ మార్కెట్ కమిటీ లో ఘటన
తాండూరు, దర్శిని ప్రతినిధి : తెలంగాణ విమోచన దినం అనగానే భారత ఉప ప్రధాని, ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ గుర్తు వస్తారు. దేశానికి స్వాతంత్రం వచ్చిన తరువాత అనేక సంస్థానాలను విలీనం చేయడంలో సర్దార్ ది ముఖ్యపాత్ర. ఈక్రమంలోనే హైదరాబాద్ తెలంగాణలో విలీనం అయ్యింది. తెలంగాణ విమోచన దినోత్సవం అనగానే నిర్వహించే దినోత్సవంలో మహాత్మా గాంధీతో పాటు సర్దార్ వల్లభాయ్ పటేల్ చిత్రపటాన్ని ఉంచి నివాళులర్పించడం మానవైతిగా వస్తుంది. ఆదివారం వికారాబాద్ జిల్లా తాండూర్ వ్యవసాయ మార్కెట్ కార్యాలయంలో సర్దార్ పటేల్ చిత్రపటం లేకుండానే తెలంగాణ విమోచన దినోత్సవం నిర్వహించారు. తాండూరు వ్యవసాయ నూతన మార్కెట్ కమిటీ చైర్పర్సన్ గద్దె వీణ శ్రీనివాస్ చారి, డైరెక్టర్లు, అధికారుల సమక్షంలో ఈ సంఘటన జరిగింది. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో రావడంతో సారీ సర్దార్ అని చర్చించుకునేలా విమోచన దినోత్సవం మారింది. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ అధికారులు, బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు శ్రీనివాస్ చారి గారు, డైరెక్టర్లు హరిహర గౌడ్, ఎండిఈ ముస్తఫా, భాను ప్రసాద్, శంకర్ నాయక్ హమాలి యూనియన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు


