వేసవిలో సాటిలేని సేవ‌..!

తాండూరు వికారాబాద్

వేసవిలో సాటిలేని సేవ‌..!
– వైశ్య ఫెడరేషన్, వాసవిక్లబ్ ప్రతినిధులకు కితాబు
– తాండూరు మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్
– అంబలి, మజ్జిగ చలివేంద్రం ప్రారంభం
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి : మండు వేసవిలో ప్రజల కోసం చల్లని అంబలి, మజ్జిగ చలివేంద్రా ఏర్పాటు చేయడం సాటిలేని సేవ చేయ‌డ‌మేన‌ని తాండూరు మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ అన్నారు. శనివారం ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు రొంపల్లి సంతోష్ కుమార్ ఆధ్వర్యంలో వైశ్య ఫెడరేషన్, వాసవి క్లబ్ సంయుక్తంగా చించాలి రోడ్డు మార్గంలో రాగి అంబలి, మజ్జిగ చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ ముఖ్య అతిథిగా హజరై చలివేంద్రాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నాలుగేళ్లుగా ప్రతి యేడాది వేసవిలో అంబలి, మజ్జిగ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం అభినందనీమన్నారు. బాటసారులకు అంబలి, మజ్జిగను అందించడం వల్ల మండే ఎండల నుంచి ఉపశమనం పొందుతారన్నారు. ప్రారంభించి వదిలేయండా వేసవి మొత్తం సేవలను అందించడం అభినందనీయమన్నారు. సమాజం మెచ్చిన సేవలు ఆదర్శంగా నిలుస్తాయన్నారు. అదేవిధంగా వైశ్య ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు రొంపల్లి సంతోష్ కుమార్ మాట్లాడుతూ వైశ్య ఫెడరేషన్, వాసవి క్లబ్ సభ్యుల సహాకారంతోనే ప్రతి యేడాది సేవాదృక్పథంతో కార్యక్రమాన్ని చేప‌డుతున్నామన్నారు. అందరి సహకారంతో సేవా తత్పరతను కొనసాగిస్తామని పేర్కొన్నారు. మరోవైపు చలివేంద్రాన్ని నిర్వహిస్తున్న సంఘ సభ్యులకు చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ అభినందించి సన్మానించారు. ఈ కార్యక్రమంలో నగరేశ్వర దేవాలయ చైర్మన్ కుంచెం మురళీధర్, కౌన్సిలర్ మంకాల రాఘవేందర్. ఆర్యవైశ్య సంఘం నూతన అధ్యక్షులు కట్కం వీరే దర్, మాజీ అధ్యక్షులు కల్వ రాజలింగం, కార్యదర్శి కోట మురళికృష్ణ, ఉపాధ్యక్షులు అలంపల్లి శ్రీనివాస్, సంయుక్త కార్యదర్శి దాదాపురం రవీందర్, వైశ్య ఫెడరేషన్ జిల్లా కోశాధికారి ఆగీర్ మహేష్, వైశ్య ఫెడరేషన్ అధ్యక్షులు గుముడాల గౌరీ శంకర్, కార్యదర్శి పార్శి వెంకట్ దాస్, కోశాధికారి రెడ్డిశెట్టి సతీష్, వాసవిక్లబ్ అధ్యక్షులు కల్వ వంశి, కార్యదర్శి పోల శ్రావణ్, కోశాధికారి శ్రీకాంత్, సభ్యులు ప్రమోద్, వినయ్, గుణవర్ధన్, రఘురాం తదితరులు పాల్గొన్నారు.