బీజేపీవి గలీజు రాజకీయాలు..!
– గవర్నర్ను అడ్డు పెట్టుకుని అడ్డంకులు
– దేశం వెనుకబాటుకు కాంగ్రెస్-ఏ1, బీజేపీ-2
– ఏండ్ల పాలనలో చెప్పింది.. చేసిందేలేదు
– తెలంగాణకు మొండిచెయ్యి ఇస్తున్న మోడి
– తెలంగాణలో సీఎం కేసీఆర్ హ్యాట్రిక్ సర్కారు ఖాయం
– రాష్ట్ర ఆర్థిక, ఆర్యోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు
తాండూరు, దర్శిని ప్రతినిధి : దేశంలోని బీజేపీ ప్రభుత్వంలో తెలంగాణలో గలీజు రాజకీయాలు చేస్తోందని తెలంగాణ రాష్ట్ర ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి మహేందర్ రెడ్డి ధ్వజమెత్తారు. ఏండ్లకు ఏండ్లు పాలించిన కాంగ్రెస్, బీజేపీలు చెప్పిన దానికన్న తక్కువే చేసి దేశం వెనుకబాటుకు ఏ-1, ఏ-2లుగా నిలిచాయని అభివర్ణించారు. బుధవారం వికారాబాద్ జిల్లా తాండూరులో నిర్వహించిన ప్రగతి ప్రస్థాన సభకు మంత్రి హరీష్ రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు ప్రసంగిస్తూ కాంగ్రెస్, బీజేపీలపై విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ 60 ఏండ్లు పాలించి, బీజేపీ 15 ఏండ్లు పాలించి దేశంను వెనుకబాటుకు గురిచేసిందన్నారు.
ఇందులో కాంగ్రెస్-ఏ1గా నిలిస్తే. బీజేపీ- ఏ2గా నిలిచిందన్నారు. దేశంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణలో గవర్నర్ ను అడ్డు పెట్టుకుని గలీజ్ రాజకీయాలు చేస్తుందని దుయ్యబట్టారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రా నికి 8 కేంద్రీయ విద్యాలయాలను ఇచ్చిన కేంద్రం, తెలంగాణకు మొండి చెయ్యి చూపిందన్నారు. తెలంగాణను దగా చేస్తున్న పీఎం మోడీ ఏ ముఖం పెట్టుకుని రాష్ట్రానికి వస్తున్నారని అందరు ప్రశ్నించాలన్నారు. దేశంలో అత్యధిక రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న బీజేపీ, 4 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాలు తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ సంక్షేమంలో, అభివృద్ధిలో ముందు వరుసలో ఉన్నారని అన్నారు. కర్ణాటకలో కాంగ్రేస్ అమలు చేస్తున్న ప థకాల కన్నా తెలంగాణలో బీఆర్ఎస్ అమలు చేస్తున్న పథకాలే గొప్పగా ఉన్నాయని అక్కడి ప్రజలే విశ్వసిస్తున్నారని అన్నారు.
అందుకనే దేశ వ్యాప్తంగా బీఆర్ఎస్ ప్రభుత్వం రావాలని ఆకాంక్షిస్తున్నారని అన్నారు. అదేవిధంగా కర్ణాటకలో అంగన్ వాడీలు, ఆశ వర్కర్లకు అందిస్తున్న వేతనాల కంటే బీఆర్ఎస్ ప్రభుత్వం అత్యధికంగా అందిస్తోందన్నారు. త్వరలోనే బీఆర్ఎస్ ప్రభుత్వం కొత్త పీఆర్సీని ప్రకటించి ఉద్యోగులతో పాటు అంగన్ వాడి, ఆశ వర్కర్లకు పీఆర్సీని ప్రకటిస్తుందని అన్నారు. ఈ క్రమంలో అంగన్ వాడీలు, ఆశలు సీపీఐ, ప్రతిపక్ష పార్టీలను నమ్మి మోసపోవద్దని, అడిగినదానికంటే ఎక్కువ చేస్తున్న సీఎం కేసీఆర్ పక్షనా నిలవాలన్నారు. అంతుకుముందు తాండూరులో నర్సింగ్ కాలేజీ, మార్కెట్ కమిటీ నూతన భవనం, బషీరాబాద్ బస్తీ దవఖాన, విద్యుత్ సబ్ స్టేషన్, కొత్త లైబ్రరీ భవనం వంటి తదితర రూ. 50 కోట్లతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు మంత్రి హరీష్ రావు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర గనులు, భూగర్భ వనరుల శాఖ మంత్రి మహేందర్ రెడ్డి, చేవేళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి, తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి, వికారాబాద్ ఎమ్మెల్యే ఆనంద్, జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి, జిల్లా గ్రం థాలయ సంస్థ చైర్మన్ రాజుగౌడ్, పార్టీ సీనియర్ నాయకులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి…

