స్వచ్ఛత అందరి బాధ్యత
– సంగెంకలాన్ లో స్వచ్ఛత హీ సేవ
– శ్రమదానంలో పాల్గొన్న ఎంపీపీ అనితా గౌడ్
– అర్హులకు అసరా ఫించన్ల పంపిణీ
తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి : స్వచ్ఛతను పాటించడం అందరి బాధ్యత అని తాండూరు ఎంపీపీ అనితా రవీందర్ గౌడ్ అన్నారు. స్వచ్ఛత హీ సేవ కార్యక్రమంలో భాగంగా సోమవారం తాండూరు మండలం సంగెంకలాన్ గ్రామంలో సర్పంచుల సంఘం అధ్యక్షులు మేఘనాథ్ గౌడ్ ఆధ్వర్యంలో శ్రమదానం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎంపీపీ అనితా గౌడ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
గ్రామస్తులతో కలిసి ఎంపీపీ అనితా గౌడ్, సర్పంచ్ మేఘనాథ్ గౌడ్ లు శ్రమదానం చేశారు. చీపురులతో రోడ్లను శుభ్రం చేయించారు. ఈ సందర్భంగా ఎంపీపీ అనితా గౌడ్ మాట్లాడుతూ గ్రామాలను పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత ప్రజలపై ఉందన్నారు. గ్రామంలోని పరిసరాలతో పాటు వ్యక్తిగత పరిశుభ్రతను పాటించాలన్నారు. అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న ఆసరా పథకం కింద గ్రామంలోని అర్హులకు ఫించన్ ను పంపిణీ చేశారు.
వృద్ధులకు, వితంతువులకు, ఒంటరి మహిళలకు, వికలాంగులకు అసరా పథకం అండగా నిలుస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్, వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు, మహిళలు, యువకులు తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి…

