రైల్వేస్టేష‌న్‌లో పోలీసుల ముమ్మ‌ర త‌నిఖీలు

క్రైం తాండూరు రంగారెడ్డి వికారాబాద్

అక్ర‌మ ర‌వాణాపై నిఘా
– రైల్వేస్టేష‌న్‌లో పోలీసుల ముమ్మ‌ర త‌నిఖీలు
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి: ప్ర‌భుత్వ నిషేధిత వ‌స్తువుల అక్ర‌మ ర‌వాణాపై ప్ర‌త్యేక నిఘా ఉంచ‌డం జ‌రుగుతుంద‌ని తాండూరు ప‌ట్ట‌ణ సీఐ రాజేంద‌ర్ రెడ్డి తెలిపారు. శ‌నివారం జిల్లా ఎస్పీ నారాయ‌ణ‌, ఉన్న‌తాధికారుల ఆదేశాల మేర‌కు
ప‌ట్ట‌ణంలోని రైల్వేస్టేష‌న్‌లో ముమ్మ‌ర త‌నిఖీలు చేప‌ట్టారు. తాండూరు మీదుగా వ‌చ్చి వెళ్లే ప‌లు రైళ్ల‌లో రాజేంద‌ర్‌రెడ్డి ఆద్వ‌ర్యంలో ఎస్ఐ సతీష్‌, పోలీసు సిబ్బంది త‌నిఖీలు చేశారు. అంతేకాకుండా రెండు ఫ్లాట్ ఫారాల‌పై వివిధ ప్రాంతాల‌కు వెళ్లే ప్ర‌యాణికుల‌ను కూడ ఆరా తీసి వివ‌రాలు సేక‌రించారు.
గుట్కా, గంజాయి, అమ్మాయిల ర‌వాణా త‌దిత‌ర నిషేధిత వ్య‌వ‌హారాల‌పై ప్ర‌త్యేక నిఘాను దృష్టిలో ఉంచుకుని దాడులు నిర్వ‌హించ‌డం జ‌రిగింద‌ని ప‌ట్ట‌ణ సీఐ రాజేంద‌ర్‌రెడ్డి తెలిపారు. ఎవ‌రైనా అక్ర‌మ ర‌వాణాల‌కు పాల్ప‌డితే చ‌ట్ట‌ప‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకోవ‌డం జ‌రుగుతుంద‌ని పేర్కొన్నారు.