గుట్టుగా గ్యాస్ రీఫిలింగ్..!
– దాడులు నిర్వహించిన జిల్లా టాస్క్ ఫోర్స్
– తాండూరు, కోడంగల్, పరిగిలో యజమానులపై కేసులు
వికారాబాద్, దర్శిని ప్రతినిధి : వికారాబాద్ జిల్లాలో గుట్టుగా సాగిస్తున్న గ్యాస్ రీఫిలింగ్ రట్టును జిల్లా టాస్క్ ఫోర్స్ అధికారులు రట్టు చేశారు. శనివారం వికారాబాద్ జిల్లా ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి ఆదేశాల మేరకు జిల్లాలోని తాండూరు, కోడంగల్, పరిగి ప్రాంతాలలో టాస్క్ ఫోర్స్ అధికారుల బృందం దాడులు చేపట్టింది. ఇందులో పెద్ద గ్యాస్ సిలిండర్ల నుంచి అక్రమంగా చిన్న సిలిండర్లపై రీఫిల్ చేస్తున్న వ్యాపారులపై టాస్క్ ఫోర్స్ బృందం కొరడా జులుపించింది.
పరిగి పట్టణం లో ఎండి అహమ్మద్ అనే వ్యాపారి చిన్న సిలిండర్లలోకి అక్రమంగా గ్యాస్ రీఫిల్ చేస్తుండగా పట్టుకున్నారు. అతి వద్ద నుంచి 8 పెద్ద సిలిండర్లు, 12 చిన్న సిలిండర్లు సీజ్ చేశారు. అదేవిధంగా ఖాన్ కాలనీలోని ఎండి అక్తర్ షాప్ పైన దాడిచేసి 3 పెద్ద సిలిండర్లు, 26 చిన్న సిలిండర్లు సీజ్ చేశారు. తాండూరు పట్టణం లోనీ వినాయక చౌక్ లో కిరన్ ఎలక్ట్రిక్ వర్క్ షాపులో ఫజల్ అనే వ్యాపారి అక్రమంగా పెద్ద సిలిండర్ల నుండి చిన్న సిలిండర్స్ లోకి గ్యాస్ రీఫిల్ చేస్తున్నట్లు గుర్తించారు. అతని వద్ద నుంచి 3 పెద్ద సిలిండర్లు,11 చిన్న సిలిండర్లు సీజ్ చేశారు.
మరోవైపు కోడంగల్ పట్టణంలోని ఆర్యనగర్ కాలనీలో కంచి శివానంద్ అనే వ్యాపారి దుకాణంలో కూడా దాడులు నిర్వహించి అక్రమంగా గ్యాస్ రీఫిల్ కు వినియోగిస్తున్న 4 పెద్ద సిలిండర్లు, 13 చిన్న సిలిండర్లు సీజ్ చేశారు. మేరకు వారిపై తాండూరు, కోడంగల్, పరిగి పోలీస్ స్టేషన్ లలో కేసులు నమోదు చేయడం జరిగిందని జిల్లా ఎస్పీ కోటి రెడ్డి తెలిపారు.
ఇది కూడ చదవండి..

