వాసు పవార్‌కు బుజ్జగింపు..!

తాండూరు రాజకీయం వికారాబాద్

వాసు పవార్‌కు బుజ్జగింపు..!
– పార్టీ మారే నిర్ణయం రద్దు
– ఎమ్మెల్యే నివాసంలో కలిసిన గిరిజన నేత
– సముచిత స్థానం ఉంటుందని ఎమ్మెల్యే హామి..?
తాండూరు, దర్శిని ప్రతినిధి: వికారాబాద్‌ జిల్లాలోని తాండూరు ప్రాంతానికి చెందిన సామాజిక సేవకుడు, ఆల్ ఇండియా బంజార సంఘం నేత వాసుపవార్‌పై బీఆర్ఎస్ పార్టీ బుజ్జగింపు మంత్రం ప్రయోగింది. గత కొంత కాలంగా వాసు పవార్ నాయక్ బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో ఆయన బీఆర్ఎస్ పార్టీని వీడనున్నట్లు ప్రచారం జరిగింది.
ఇటీవల వాసు పవర్ నాయక్ ఆధ్వర్యంలో జిల్లాలోని వికారాబాద్, పరిగి, కోడంగల్, తాండూరు నియోజకవర్గాలకు చెందిన 60 మంది సర్పంచులు, 40 మంది ఎంపీటీసీలతో పాటు నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు పుకార్లు వచ్చాయి. అయితే అనూహ్యంగా వాసుపవార్‌ నాయక్ బీఆర్ఎస్‌ పార్టీలోనే కొనసాగుతున్నట్లు హింట్ ఇచ్చారు.

బుధవారం రాత్రి తాండూరు పట్టణంలోని ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి నివాసంలో ఎమ్మెల్యేతో వాసుపవార్‌ నాయక్ భేటీ అయ్యారు. ఈ భేటిలో వాసుపవార్‌ నాయక్‌ను బుజ్జగించినట్లు తెలుస్తోంది. పార్టీలో వాసుపవార్‌ నాయక్‌కు సముచిత స్థానం కల్పిస్తామని హామి ఇచ్చినట్లు సమాచారం. దీంతో వాసు పవార్ నాయక్ పార్టీ మారే నిర్ణయాన్ని విరమించుకున్నట్లు సన్నిహితులు తెలిపారు.

ఇది కూడా చదవండి..

మోగిన ఎలక్షన్ నగారా..!