కాంగ్రెస్ బస్సుయాత్రకు ముహుర్తం ఫిక్స్‌

తాండూరు రాజకీయం వికారాబాద్

కాంగ్రెస్ బస్సుయాత్రకు ముహుర్తం ఫిక్స్‌
– 28న తాండూరులో భారీ ఏర్పాట్లు
– హాజరు కానున్న కర్ణాటక డిప్యూటీ సీఎం
– టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి, ముఖ్యనేతల రాక
– మీడియాతో వెల్లడించిన డీసీసీబీ చైర్మన్ మనోహర్ రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి : కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బస్సుయాత్ర తాండూరులో నిర్వహించేందుకు ముహుర్తం ఖరారయ్యింది. ఈ శనివారం బస్సుయాత్రను ప్రారంభించబోతున్నట్లు ఆ పార్టీ నాయకులు, డీసీసీబీ చైర్మన్ మనోహర్ రెడ్డి, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ధారాసింగ్ లు తెలిపారు. గురువారం మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ శనివారం తాండూరులో ప్రారంభిస్తున్న బస్సు యాత్రకు కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి, సీఎల్పీ నాయకులు బట్టి విక్రమార్క, మాజీ మంత్రి ప్రసాద్ కుమార్, డీసీసీ అధ్యక్షులు రామ్మోహన్ రెడ్డి, ముఖ్య నేతలు హాజరవుతున్నారని తెలిపారు.

బస్సుయాత్రను దృష్టిలో ఉంచుకుని తాండూరులో 25 వేల నుంచి 40 వేల మందితో బహిరంగ సభ నిర్వ వాస్తున్నామన్నారు. కావున నియోజకవర్గంలోని వివిధ మండలాల నుంచి నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవతం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు ఉత్తమ్ చంద్, జనార్దన్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, అలీం, మహిళ అధ్యక్షురాలు శోభారాణి, పెద్దేముల్ వైస్ ఎంపీపీ మధులత శ్రీనివాస్ చారి, నేతలు, కార్యకర్తలు ఉన్నారు.

ఇది కూడా చదవండి…

గుండెపోటుతో ఆర్టీసీ కండక్టర్ కన్నుమూత