రూ.2.50 లక్షల నగుదు పట్టివేత
– వివరాలు వెల్లడించిన సీఐ రాజేందర్ రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి : ఎలాంటి ఆధారాలు లేకుండా తరలిస్తున్న నగదును పట్టుకున్నట్లు పట్టణ సీఐ రాజేందర్ రెడ్డి తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. శ్రీనివాస్ అనే వ్యక్తి రూ.2.50లక్షల నగదుతో పట్టణంలోని ఇందిరా చౌరస్తా మీదుగా వెళుతున్నారు. ఎన్నికల కోడ్ అమల్లో భాగంగా అక్కడ తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులు శ్రీనివాస్ ను కూడా తనిఖీ చేశారు. దీంతో అతని వద్ద నుంచి ఎలాంటి ఆధారాలు లేకుండా తరలిస్తున్న రూ.2.50 లక్షలను గుర్తించారు. ఈ మేరకు నగదును స్వాదీనం చేసుకుని. స్క్రీనింగ్ కమిటికి అందజేయడం జరుగుతుందని సీఐ రాజేందర్ రెడ్డి వెల్లడించారు.
ఇది కూడా చదవండి…

