కాలనీల్లో కమలం జెండా ఎగురేస్తాం

తాండూరు రాజకీయం వికారాబాద్

కాలనీల్లో కమలం జెండా ఎగురేస్తాం
– బీజేపీ నుంచి అవకాశం ఇవ్వండి
– యువనాయకుడు రోహిత్ సుగంధి
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణంలోని రాజీవ్, ఇందిరమ్మ కాలనీల్లో కమలం జెండా ఎగురవేస్తామని బీజేపీ యువనాయకుడు రోహిత్ సుగంధి అన్నారు. మంగళవారం బీజేపీ తాండూరు పట్టణ అధ్యక్షులు నాగారం మల్లేశంకు వినతి పత్రం అందజేశారు.

వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో 8వ వార్డు రాజీవ్ గృహకల్ప కాలనీ, ఇందిరమ్మ కాలనీల నుంచి కౌన్సిలర్ గా పోటీ చేసేందుకు అవకాశం కల్పించాలని అభ్యర్థన ప్రత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా రోహిత్ సుగంధి మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ గెలుపుకోసం తన వంతు కృషి చేస్తానని తెలిపారు. ఇందులో భాగంగా 8వ వార్డు నుంచి కౌన్సిలర్‌గా పోటీ చేసేందుకు అవకాశం కల్పించాలని కోరారు. తనపై నమ్మకంతో పార్టి టికెట్ కేటాయిస్తే.. వార్డు ప్రజల మద్దతుతో గెలిచి కమలం జెండా ఎగురవేస్తామని అన్నారు.

ఇదికూడా చదవండి…

మున్సిపల్ బరిలో బిర్కడ్ ఉశ వినయ్..!