తాండూరు పట్టణ ఎస్ఐగా అబ్దుల్ రవూఫ్

కెరీర్ తాండూరు రాజకీయం వికారాబాద్

తాండూరు పట్టణ ఎస్ఐగా అబ్దుల్ రవూఫ్
– బదిలీ అయిన ఎస్ఐ వేణుగోపాల్ గౌడ్
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణ ఎస్ఐగా అబ్దుల్ రవూఫ్ నియామకం అయ్యారు. ఇక్కడ ఎస్ఐగా పనిచేస్తున్న వేణుగోపాల్ గౌడ్ బషీరాబాద్ మండల ఎస్ఐగా బదిలీ అయ్యారు. సోమువారం వికారాబాద్ జిల్లా ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి బదిలీ, నియామకం ఉత్తర్వులను జారీ చేశారు. గత ఏడాది క్రితం వేణుగోపాల్ గౌడ్ తాండూరు పట్టణ ఎస్ఐగా బాధ్యతలు చేపట్టారు. సరిగ్గా ఏడాది తరువాత ఆయనకు స్థాన చలనం కల్పించారు. బషీరాబాద్ మండల ఎస్ఐగా నియమించారు. అదేవిధంగా పట్టణ ఎస్ఐగా నియామకం అయిన అబ్దుల్ రవూఫ్ గతంలో కూడా తాండూరు పట్టణ ఎస్ఐగా పనిచేశారు. 2021 ఏడాది చివర్లో ఆయన పట్టణ ఎస్ఐగా విధుల్లో చేరారు. కొన్నాళ్ల తరువాత ఆయనను పెద్దేముల్ పోలీస్టేషన్ కు బదిలీ చేశారు. తాజాగా ఆయన మరోసారి తాండూరు పట్టణ ఎస్ఎస్ఐగా బాధ్యతలు చేపట్టనున్నారు.

ఇది కూడా చదవండి…
స్కూల్లో బ్రేక్‌ ఫాస్ట్..!
– సర్కారు బడులలో అమలు
– వచ్చే ఏడాది నుంచి కొత్త మెను
https://dharshininews.com/17189
chaithany collage