మతి బ్రమించి మాట్లాడొద్దు..!

తాండూరు రాజకీయం వికారాబాద్

మతి బ్రమించి మాట్లాడొద్దు..!
– రేవంత్‌ను విమర్శించే స్థాయి ఎమ్మెల్యేకు లేదు
– కాంగ్రెస్ నుంచి గెలిచి నీవేంతకు అమ్ముడుపోయావ్
– అభివృద్ధి, కబ్జాల ఆరోపణల చర్చకు సిద్ధం
– గ్యారెంటీ పథకాలతో బీఆర్ఎస్కు బొంద ఖాయం
– ఎమ్మెల్యే సవాల్ కు కౌంటర్ ఇచ్చిన మనోహర్ రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి మతిబ్రమించి మాట్లాడుతున్నారని, తెలంగాణ టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డిపై వాఖ్యలు చేసేంత స్థాయి ఆయనకు లేదని కాంగ్రెస్ నాయకులు. డీసీసీబీ చైర్మన్, తాండూరు ఎమ్మెల్యే అభ్యర్థి బుయ్యని మనోహర్ రెడ్డి అన్నారు. టిక్కెట్లు అమ్ముకున్నాడని రోహిత్ రెడ్డి చేసిన వాఖ్యలను ఆయన ఖండించారు. ఆదివారం సాయంత్రం పట్టణంలోని ఎస్వీఆర్ గార్డెన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో మనోహర్ రెడ్డితో పాటు కాంగ్రెస్ నాయకులు మాట్లాడారు. గత ఎమ్మెల్యే ఎన్నికల్లో కాంగ్రెస్ బీఫారం నుంచి గెలిచిన ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరేందుకు ఎంతకు అమ్ముడు పోయారో చెప్పాలన్నారు.

అభివృద్ధి పేరుతో బీఆర్ఎస్ లో చేరిన రోహిత్ రెడ్డి సొంత అభివృద్ధి చెందాడే తప్పా తాండూరుకు చేసిందేమి లేదన్నారు. ఆయన చేసిన అభివృద్ధి పేపర్లపైనే కనిపిస్తోందన్నారు. తాండూరులో ఆయనొక్కడే కాకుండా తండ్రి, బాబాయిలతో కలిపి మొత్తం ముగ్గురు ఎమ్మెల్యేలుగా ఉన్నట్లు కనిపిస్తోందన్నారు. ఈ ఐదేండ్లలో ఎమ్మెల్యే చేసిన అవినీతి, కబ్జాలపై టీపీసీసీ అధ్యక్షులు చేసిన ఆరోపణలు నిజమైనవే అని అన్నారు. ఎమ్మెల్యే చేసిన సవాల్ ను స్వీకరించి చర్చకు సిద్ధంగా ఉన్నామన్నారు. ఎక్కడా, ఎప్పుడు అనేది సమయం చెబితే సాక్షాధారాలతో చర్చలకు వచ్చేందుకు రెడీగా ఉన్నామన్నారు. రేవంత్ రెడ్డిపై విమర్శలు చేసే స్థాయి ఎమ్మెల్యే రోహిత్ రెడ్డికి లేదని, మతిభ్రమించి వాఖ్యలు చేస్తే ఊరుకునేది లేదన్నారు. కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారెంటీలపై దుష్ప్రచారం చేయడం తగదన్నారు.

కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్లకు సవాల్ చేయడం మామూలు విషయం కాదన్నారు. ఈ ఆరు గ్యారెంటీ పథకాలే బీఆర్ఎస్ పార్టీకి బొంద పెట్టేలా మారడం ఖాయమన్నారు. అదేవిధంగా తనకు 20 ఏండ్ల క్రితమే తాండూరులో ఓటు హక్కు ఉందని, తాను నాన్ లోకల్ కాదన్నారు. నాన్ లోకల్ నినాదం ఎమ్మెల్యే తల్లికి వర్తించదా అని ప్రశ్నించారు. అంతకుముందు టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ధారాసింగ్, నాయకులు ఉత్తమ్ చంద్ లు మాట్లాడుతూ కాంగ్రెస్ నుంచి గెలిచి బీఆర్ఎస్ లో చేరిన ఎమ్మెల్యే కూడా వలసపక్షే అని విమర్శించారు. ఓ ప్రాంతంలోని సర్వేనెంబర్ 138లో ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి. ఆయన తండ్రి భూములను రెగ్యూలరైజ్ చేస్తామని డబ్బులు వసూలు చేశారని ఆరోపించారు. మండలంలోని సర్వేనెంబర్ 206లో ప్రభుత్వ భూమికి జరిగిన బహిరంగ వేలంలో ఎమ్మెల్యే బాబాయ్ ఇందర్ చెడ్ రాజు 26 ఏకరాలను సొంతం చేసుకున్నారని అన్నారు.

40 ఏండ్లలో చేయని అభివృద్ధి చేశానని చెప్పుకుంటున్న ఎమ్మెల్యే గతంలో తాండూరులో పనిచేసిన మంత్రులు, ఎమ్మెల్యేలు ఏం అభివృద్ధి చేయలేదా అని ప్రశ్నించారు. ఎన్నికల ముందే అభివృద్ధి పనులకు శిలాఫలాకాలు వేసి గొప్పలు పోతున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ మాజీ చైర్మన్ లక్ష్మా రెడ్డి, నాయకులు జనార్ధన్ రెడ్డి. డాక్టర్ సంపత్ కుమార్, వడ్డె శ్రీనివాస్, రాందాస్, అబ్దుల్ రవూఫ్, మసూద్, కౌన్సిలర్ ప్రభాకర్ గౌడ్, నాయకులు జర్నప్ప, శంకరయ్య, మాజీ కౌన్సిలర్ శ్రీనివాస్, నేతలు, కార్యకర్తలు ఉన్నారు.

ఇది కూడా చదవండి…

గుండెపోటుతో ఆర్టీసీ కండక్టర్ కన్నుమూత