ఘనంగా కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు
– నివాళులు అర్పించిన రాజకీయ, సంఘాల నాయకులు
తాండూరు, దర్శిని ప్రతినిధి: స్వాతంత్ర సమరయోధులు, తెలంగాణ ఉద్యమకారుడు తెలంగాణ విముక్తి కోసం నిరంతరం కృషి చేసిన ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ గారి జయంతిని తాండూరులో ఘనంగా నిర్వహించారు. సోమవారం బీసీ సంక్షేమ సంఘం తాండూరు నియోజకవర్గ వర్గ కన్వీనర్ కందుకూరి రాజ్ కుమార్ ఆధ్వర్యంలో పట్టణంలోని ది గ్రేన్ అండ్ సీడ్స్ మర్చంట్స్ అసోసియేషన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన జయంతి ఉత్సవాలలో రాజకీయ పార్టీల నాయకులు, వివిధ సంఘాల నాయకులు కొండ లక్ష్మణ్ బాపూజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధనతో పాటు దేశసేవకు కృషి చేసిన మహనీయుడు కొండా లక్ష్మణ్ బాపూజీ అని కొనియాడారు. ఆయన ఆశయ సాధనకు అందరు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ ఉపాధ్యక్షులు, తాండూర్ కాంగ్రెస్ ఇంచార్జ్ యం. రమేష్ మహరాజ్, టీఆర్ఎస్ నాయకులు రాజుగౌడ్, శ్రీనివాస్ చారి, పట్లోళ్ల నర్సింలు, సీపీఐ రాష్ట్ర నాయకురాలు విజయలక్ష్మీ పండిత్, టీజేఏస్ నాయకులు సోమశేఖర్, కౌన్సిలర్ రాము, నాయకులు గుండప్ప, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి యు. రమేష్ కుమార్, కౌన్సిలర్ అంతారం లలిత, బీజేపీ కార్యదర్శి బంటారం భద్రేశ్వర్, టీఆర్ఎస్ నాయకులు రాజన్ గౌడ్, టైలర్ రమేష్, అశోక్, యాలాల మండల బీసీ సంఘం అధ్యక్షులు లక్ష్మణా చారి, యూత్ కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు బంటు వేణుగోపాల్, వివిధ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.


