కారులోకి బీజేపీ, కాంగ్రెస్ నేతలు
– ఆహ్వానించిన ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి : బీఆర్ఎస్ పార్టీలోని కాంగ్రెస్, బీజేపీ నేతలు వలస వచ్చారు. గురువారం తాండూరు పట్టణంలోని ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి నివాసంలో గులాబీ గూటికి చేరుకున్నారు. బీజేపీకి చెందిన మున్సిపల్ కౌన్సిలర్ బొప్పి అంజలి భర్త, బొప్పి సురేష్ తోపాటు కాంగ్రెస్ పార్టీకి చెందిన శివకుమార్ లకు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు అగ్గనూర్ జగదీశ్వర్, తంబాకు చంద్రశేఖర్, శ్రీనివాస్ చారి, బంటారం సుధాకర్, విజయ్ కుమార్, పటేల్ ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.
ఇదికూడా చదవండి…

