విశ్రాంత ఉద్యోగుల సేవలో ఉంటా

కెరీర్ తాండూరు రాజకీయం వికారాబాద్

విశ్రాంత ఉద్యోగుల సేవలో ఉంటా
– వైద్యం, ఫించన్ సకాలంలో అందేలా కృషి
– డీసీసీబీ చైర్మన్ బుయ్యని మనోహర్ రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరులోని విశ్రాంత ఉద్యోగుల సేవలకు అందుబాటులో ఉంటానని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి, డీసీసీబీ చైర్మన్ మనోహర్ రెడ్డి అన్నారు. గురువారం తాండూరులోని రిటైర్డ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మనోహర్ రెడ్డి విశ్రాంత ఉద్యోగులతో మాట్లాడారు. ఎన్నికల్లో తనకు మద్దతు తెలపాలని కోరారు. అధికారంలోకి వస్తే విశ్రాంత ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తామన్నారు. ప్రతినెల 1వ తేదిన ఫించన్‌ అందేలా కృషి చేస్తామన్నారు. అదేవిధంగా ఆరోగ్య కార్డుల ద్వారా వైద్య సేవలు అందేలా చూస్తామన్నారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ధారాసింగ్, ఉత్తమ్ చంద్, టీజేఎస్ కౌన్సిలర్ సోమశేఖర్, విశ్రాంత ఉద్యోగుల సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి…

 మోసపోవద్దు గొసపడతాం..