పైలెట్ కోసం జోరుగా ప్రచారం..!
– బీసీ సంఘం ప్రచారానికి స్పందన
– స్వచ్ఛందంగా పాల్గొంటున్న బీసీ యువత
తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి కోసం బీసీ సంఘం నేతలు జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. మంగళవారం బీసీ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు, తాండూరు కన్వినర్ కందుకూరి రాజ్ కుమార్ ఆదేశాల మేరకు సంఘం నాయకులు బషీరాబాద్ మండలంలో ప్రచారం నిర్వహించారు. బషీరాబాద్ మండలంలో మంతటి రెడ్డి, ఘనపూర్ గ్రామాల్లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి గెలుపే లక్ష్యంగా గ్రామ గ్రామాన ప్రచారం నిర్వహిస్తున్న ప్రచారానికి మంచి స్పందన లభించింది.
పైలట్ రోహిత్ రెడ్డి బీసీల పట్ల ఉన్న శ్రద్ధను గ్రామాల్లో ఉన్న యువకులకు ఓటర్లకు వివరించి కరపత్రాలు అందజేసి రోహిత్ రెడ్డి కే ఓటు వేయాలని అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీసీ కార్యదర్శి సయ్యద్ సుకుర్ మాట్లాడుతూ జాతీయ బిసి అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య తాండూర్ నియోజకవర్గం బీసీ సంఘం కన్వీనర్ రాజ్ కుమార్ నేతృత్వంలో రోహిత్ రెడ్డి గెలుపు కొరకై కృషి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో బిసి బషీరాబాద్ మండల అధ్యక్షులు నరేందర్, బీసీ నాయకులు గడ్డం వెంకటేష్, కృష్ణ, సురేష్, రాము ముదిరాజ్, ప్రసాద్, వెంకటేష్, నవీన్, బసవరాజ్ తదితరులు పాల్గొన్నారు.
ఇదికూడా చదవండి…

