హస్తం వస్తే సంక్షేమం ఖతమే..!

తాండూరు రాజకీయం వికారాబాద్

హస్తం వస్తే సంక్షేమం ఖతమే..!
– బీఆర్ఎస్ వస్తే అందరికి సంక్షేమం
– ఎన్నికల్లో ఇంటోని వైపుంటారా లేదా బయటోని వైపా
– ఆలోచింపజేసిన ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ప్రసంగం
– తాండూరులో వడ్డెర సంఘం ఆత్మీయ సమ్మేళనం
తాండూరు, దర్శిని ప్రతినిధి : హస్తం పార్టీ అధికారంలోకి వస్తే బీఆర్ఎస్ సంక్షేమ పథకాలు ఖతం అవుతాయని, అందుకే ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి అన్నారు. బుధవారం తాండూరు పట్టణంలోని భవానీ పంక్షన్ హాల్ లో నియోజకవర్గ వడ్డెర సంఘం నాయకులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి హాజరైన ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి తాండూరు ప్రజలు ఆలోచించేలా ప్రసంగం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణలో అన్ని వర్గాల సంక్షేమం కోసం ఆసరా, కళ్యాణలక్ష్మీ, షాదీముభారక్, రైతుబందు. రైతుబీమా, దళితబందు, బీసీ బందు, గృహలక్ష్మీ, ఉచిత విద్యుత్ వంటి పథకాలను అమలు చేసిందన్నారు.

ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ మోసపూరిత ఆరు గ్యారెంటీలతో ప్రజల్లోకి వస్తుందని విమర్శించారు. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే సంక్షేమాన్ని పెంచేలా ప్రకటించిన అద్భుతమైన మెనిఫెస్టోను అమలు చేస్తుందన్నారు. ఆసరా ఫించన్ పెంపు, ఆరోగ్య శ్రీ పెంపు, రైతుబందు పెంపుతో పాటు రూ.400లకే గ్యాస్ సిలిండర్, మహిళలకు ఆర్థిక సాయం అందిస్తుందన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే అన్ని పథకాలు ఖతం చేస్తుందన్నారు. ఆ పార్టీని నమ్మితే అంతే అని అన్నారు. అదేవిధంగా ఎన్నికల ముందు ముక్కు, ముఖం తెలియని బయటి వ్యక్తి కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్నారని అన్నారు.

రెండేళ్లలో తాండూరు బిడ్డగా రూ.1680 కోట్లతో తాండూరు రూపు రేఖలు మార్చడం జరిగిందన్నారు. ఈ ఎన్నికల్లో అభివృద్ధి, సంక్షేమాన్ని చేసిన ఇంటొన్ని గెలిపిస్తారా.. బయటోన్ని గెలిపిస్తారో ఆలోచించుకోవాలని ఆగం కావద్దని సూచించారు. ఈ ప్రసంగంతో తాండూరు ప్రజలను ఆలోచింపజేసేలా ఆకట్టుకున్నారు. అదేవిధంగా ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ, తనను గెలిపిస్తే వడ్డెరుల డిమాండ్ల పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కరణం పురుషోత్తంరావు, నాయకులు శ్రీనివాస్ చారి, అంతరం సర్పంచ్ రాములు, విజయలక్ష్మి, గిర్జా పురం లక్ష్మి, గిర్జాపురం రాములు కౌన్సిలర్ రాము, పండరి, జినుగుర్తి రాములు, పరశురాం, ఇట్ల పురం వెంకట్, బిఆర్ఎస్ నాయకులు రాజు గౌడ్, కరణం పురుషోత్తం, తాండూర్ నియోజకవర్గంలోని తాండూరు, పెద్దముల్, యాలాల్, బషీరాబాద్ మండలాలతోపాటు తాండూర్ పట్టణ వడ్డెర సంఘం సభ్యులు, మహిళలు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి..

 మోసపోవద్దు గొసపడతాం..