ఎంపీ రంజిత్ రెడ్డికి శుభాకంక్షల వెల్లువ
– విషెస్ చెప్పిన తాండూరు టీఆర్ఎస్ నాయకులు
తాండూరు, దర్శినిప్రతినిధి: చేవేళ్ల ఎంపీ గడ్డం రంజిత్ రెడ్డికి తాండూరు టీఆర్ఎస్ నేతల శుభాకాంక్షలు వెలువెత్తాయి. ఆదివారం ఎంపీ రంజిత్ రెడ్డి జన్మదినం సందర్భంగా తాండూరు నుంచి టీఆర్ఎస్ నేతలు భారీగా తరలివెళ్లారు. టీఆర్ఎస్ సీనీయర్ నాయకులు కరణం పురుషోత్తంరావు, తాండూరు పట్టణ మాజీ అధ్యక్షులు అబ్దుల్ రవూఫ్, డీసీసీబీ జిల్లా డైరెక్టర్ రవీందర్ గౌడ్, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ శోభారాణి, మాజీ వైస్ చైర్ పర్సన్ పట్లోళ్ల రత్నమాల నర్సింలు, కౌన్సిలర్లు పట్లోళ్ల నీరజాబాల్ రెడ్డి, రాము, కోఆప్షన్ సభ్యులు అబ్దుల్ ఖవి, మాజీ కౌన్సిలర్ జుబేర్ లాల, నాయకులు మసూద్, రాజశేఖర్, పండరి తదితరులు ఎంపీ రంజిత్ రెడ్డిని కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.



