కాంగ్రెస్‌ గెలుపును ఆపలేరు..!

తాండూరు రాజకీయం వికారాబాద్

కాంగ్రెస్‌ గెలుపును ఆపలేరు..!
– అధికారంలోకి వచ్చాక ఆరు గ్యారెంటీలు పక్కా
– వేల కోట్లు దోచుకున్న పైలెట్ రోహిత్ రెడ్డి
– దోచుకునోళ్లు ఓట్లు అడిగేందుకు సిగ్గుండాలి
– డీసీసీబీ చైర్మన్ బుయ్యని మనోహర్ రెడ్డి
– మండలంలో కాంగ్రెస్ ప్రచారానికి బ్రహ్మరథం
తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి : ఈ ఎన్నీకల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపును ఎవ్వరు ఆపలేరని ఆ పార్టీ తాండూరు ఎమ్మెల్యే అభ్యర్థి, డీసీసీబీ చైర్మన్ బుయ్యని మనోహర్ రెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం తాండూరు మండలంలో కాంగ్రెస్ పార్టీ ప్రచారం కార్యక్రమాలు నిర్వహించారు. మండలంలోని సిరిగిరి పేట్, ఐనెల్లి, కొల్లాపూర్, మల్కాపూర్, సంగెంకలాన్, వీరారెడ్డిపల్లి, మిట్టబాస్పల్లి, గుంతబాస్పల్లి, సంకిరెడ్డిపల్లి, కోటబాస్పల్లి గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ ప్రచారం ముమ్మరంగా కొనసాగింది. సిరిగిరిపేట్లో భారీ ర్యాలీతో స్వాగతం పలకగా ఐనెల్లిలో మహిళలు హారతులతో స్వాగతం పలికారు.

మల్కాపూర్‌లో మేయిన్ గేటు నుంచి బైకు ర్యాలీతో స్వాగతం చెప్పారు. కొల్లాపూర్లో రేణుకా ఎల్లమ్మను మనోహర్ రెడ్డి నతేలతో కలిసి దర్శించుకున్నారు. ఆయా గ్రామాల్లో ప్రచారానికి వచ్చిన మనోహర్ రెడ్డికి గ్రామాల ప్రజలు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మనోహర్ రెడ్డి మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలకు చేసిందేమి లేదన్నారు. అడుగడుగునా ప్రజలకు మోసపూరిత హామీలు ఇచ్చి పబ్బం గడిపిందన్నారు. దళితులను, బీసీలు, మైనార్టీలను మభ్యపెట్టిందన్నారు. కాంగ్రెస్ పార్టీతోనే సంక్షేమ రాజ్యం వస్తుందని, అందుకే ఈ -ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలన్నారు. అధికారంలోకి వస్తే పేదల కోసం ప్రకటించిన ఆరు గ్యారెంటీ పథకాలను అమలు చేస్తుందని అన్నారు. ఈనెల 30న జరిగే పోలింగ్ లో హస్తం గుర్తుకు ఓటేసి గెలిపించాలన్నారు.

అవినీతి.. దోపిడీ.. కబ్జా
అదేవిధంగా నాలుగేండ్లు అధికారంలో ఉన్న ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి అవినీతి. దోపిడి. కబ్జాలకు పాల్పడ్డారని విమర్శించారు. సిరిగిరిపేట్ గ్రామంలో 26 ఎకరాలు కబ్జా చె శారని ఆరోపించారు. అంతేకాకుండా దళిత బందు, బీసీ బంధు పథకాలలో అనుచరులకే లబ్దిచేకూర్చి అవినీతికి పాల్పడ్డారని అన్నారు. ఈనాలుగేండ్లలో ఇంత పెద్ద ఎత్తున ఆయన ఆస్తులు ఎలా పెరిగాయని ఆలోచించాలన్నారు. ప్రజల సొమ్మును దోచుకున్న బీఆర్ఎస్ నాయకులు ఓట్లు అడిగేందుకు సిగ్గుండాలన్నారు.

ఈ కార్యక్రమాల్లో డీసీసీబీ మాజీ చైర్మన్ లక్ష్మారెడ్డి, ఉమ్మడి జిల్లా డైరెక్టర్ రవీందర్ గౌడ్. మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ వడ్డె శ్రీనివాస్, ఎల్మకన్నె సహాకార సంఘం మాజీ చైర్మన్ నారాయణ గౌడ్, మండల పార్టీ అధ్యక్షులు జె. నాగప్ప , బీసీ సెల్ జిల్లా అధ్యక్షులు ఉత్తమ్ చంద్, సీనీయర్ నేతలు జనార్ధన్ రెడ్డి. గుర్రంపల్లి రాందాస్, ఎంపిటీసీ రాజ్ కుమార్, మాజీ ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి…

 మోసపోవద్దు గొసపడతాం..