జనాల జేజేలు పైలెట్ కే..!
– తాండూరులో 20వేల మెజార్టీ ఖాయం
– అన్నివర్గాల అభివృద్ధికి కృషి చేసిన ఎమ్మెల్యే
– బీసీ సంఘం జా. కార్యవర్గ సభ్యులు కందుకూరి రాజ్ కుమార్
– పట్టణంలో హోరెత్తించిన బీసీ సంఘం ప్రచారం
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు జనాలు అందరు పైలెట్ రోహిత్ రెడ్డికే జేజేలు పలుకుతున్నారని బీసీ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు, నియోజకవర్గ కన్వినర్ కందుకూరి రాజ్ కుమార్ అన్నారు. అసెంబ్లీ’ ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం తాండూరు పట్టణంలో రాజ్ కుమార్ ఆధ్వర్యంలో బీసీ సంఘం నేతలు ప్రచారం చేశారు. పట్టణంలోని కాళీకాదేవి ఆలయం నుంచి భద్రేశ్వర చౌక్, గాంధీ చౌక్, మర్రిచెట్టు కూడలి, ఇందిరా చౌరస్తా మీదుగా సర్దార్ పటేల్ చౌరస్తా వరకు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి తరుపున ప్రచారాన్ని హోరెత్తించారు. పురవీదుల్లో పాదయాత్ర చేస్తూ పైలెట్ కు నినాదాలు పలుకుతూ ముందుకు సాగారు. మార్గంలో ఉన్న చిరు వ్యాపారులు, పెద్ద వ్యాపారులను, ప్రజలను కలిసి రోహిత్ రెడ్డిని గెలిపించాలని కరపత్రాలను అందజేశారు.
అనంతరం కందుకూరి రాజ్ కుమార్ మాట్లాడుతూ తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి అన్ని వర్గాల సంక్షేమానికి కృషి చేశారని అన్నారు. రోహిత్ రెడ్డి సహాకారంతో విద్యార్థులకు ఉపకార వేతనాలు అందాయన్నారు. డిగ్రీ కాలేజీ భవనం, గురుకుల పాఠశాలల ఏర్పాటుకు కృషి చేశారని అన్నారు. తాండూరులో బీసీలు, కులవృత్తుల అభ్యున్నతిని తోడ్పాటు అందించారని గుర్తుచేశారు. ఎన్నికల్లో పైలెట్ రోహిత్ రెడ్డికి మనసారా మద్దత ఇస్తున్నారని అన్నారు. జనాల జేజేలు చూస్తుంటే రోహిత్ రెడ్డికి 20వేల మెజార్టీ ఖాయమన్నారు. బీసీలతో పాటు అన్ని వర్గాల సంక్షేమానికి కృషి చేసిన ఎమ్మెల్యే రోహిత్ రెడ్డిని గెలిపించుకుందామని అన్నారు.
ఈ కార్యక్రమంలో బీసీ సంఘం రాష్ట్ర కార్యదర్శి సయ్యద్ షుకూర్, జిల్లా నాయకులు గడ్డం వెంకటేష్, మహిళ సంఘం అధ్యక్ష, కార్యదర్శులు జ్యోతి, అనిత, బషీరాబాద్ మండల అధ్యక్షులు నరేందర్, బీసీ, యువనాయకులు బస్వరాజ్, రాము ముదిరాజ్, పాండు గౌడ్, నరేష్, డీవై ప్రసాద్, ధన్ రాజ్, వెంకట్, నిఖిల్, అఖిల్, ప్రవీణ్ గౌడ్, నవీన్, సురేందర్, శ్రీనివాస్, చాకలి రఘు, వెంకట్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి…

