ప్రసాదన్నకు శుభాకాంక్షల వెల్లువ
– మర్యాద పూర్వకంగా కలిసిన బందుమిత్రులు
– స్పీకర్ ను సన్మానించిన తాండూరు వాసులు
తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి : తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్గా ఎన్నికైన వికారాబాద్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ కుమార్ కు శుభాకాంక్షల వెల్లువ కొనసాగింది. గడ్డం ప్రసాద్ కుమార్ కు తాండూరు పట్టణం, తాండూరు మండలంలో సంబంధం ఉంది. తాండూరు మండలంలోని బెల్కటూర్ ఆయన స్వస్థలం కాగా పట్టణంలోని కుమ్మరి గల్లిలో ఉంటూ విద్యాభ్యాసం చేశారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో వికారాబాద్ ఎమ్మెల్యేగా గెలవడంతో పాటు రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ గా ఎన్నిక కావడం పట్ల తాండూరు పట్టణంతో పాటు మండలంలోని కుటుంబ సభ్యులు, బందు మిత్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. శుక్రవారం కుటుంబ సభ్యులతో పాటు మండలంలోని చెంగోల్ గ్రామానికి చెందిన బందు మిత్రులు రాజ్ కుమార్, గోపాల్, కిరణ్ కుమార్ తో పాటు మర్పల్లికి చెందిన నర్సింలు యాదవ్ తదితరులు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ను కలిసి శుభాంక్షలు తెలిపారు. శాలువాతో సన్మానించి పుష్ప గుచ్చాలను అందజేశారు.
ఇదికూడా చదవండి…

