క్రీడలతో నైపుణ్యం, ఐక్యమత్యం
– యూనిటి కఫ్ టోర్నమెంట్ భేష్
– బీసీ సంఘం కన్వినర్ కందుకూరి రాజ్ కుమార్
తాండూరు, దర్శిని ప్రతినిధి: క్రీడలతో నైపుణ్యతను సాధించుకోవడమే కాకుండా అన్ని వర్గాలతో ఐక్యమత్యాన్ని పెంపొందించుకోవచ్చని బీసీ సంక్షేమ సంఘం తాండూరు నియోజకవర్గ కన్వినర్ కందుకూరి రాజ్ కుమార్ అన్నారు. తాండూరు మున్సిపల్ పరిధి పాత తాండూరు యువత ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఓల్డ్ తాండూరు యూనిటి కప్ – 5 ఫైనల్ మ్యాచ్ ఆదివారం జరిగింది. శివాజీ 11 వర్సెస్ రహమత్ నగర్ 11 జట్ల పోటీకి బీసీ సంఘం కన్వినర్ రాజ్ కుమార్ హాజరై టాస్ వేసి మ్యాచ్‌ను ప్రారంభించారు.
ఈ సందర్భంగా రాజ్ కుమార్ మాట్లాడుతూ గత ఐదేళ్లుగా ఓల్డ్ తాండూరు యూనిటీ కప్ టోర్నమెంట్ నిర్వహిస్తున్న నిర్వహకులను అభినందించారు. క్రీడల వల్ల క్రీడానైపుణ్యం సాధించవచ్చన్నారు. ఇలాంటి క్రీడలతో అన్ని వర్గాల యువత మద్య స్నేహపూరిత వాతావరణం నెలకొని ఐక్యత భావం పెంపొందుతుందని, మత సామరస్యత బలపడుతుందని అన్నారు. క్రీడల్లో తాండూరుకు మంచి పేరు తీసుకరావాలని ఆకాంక్షించారు. అంతకుముందు క్రీడాకారులతో కరచాలనం చేసి ఆల్ ది బెస్ట్ చెప్పారు. అనంతరం బ్యాటింగ్ చేసి క్రీడాకారులను ఉత్సహా పరిచారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘం రాష్ట్ర నాయకులు సయ్యద్ సుకూర్, జిల్లా నాయకులు గడ్డం వెంకటేష్, నాయకులు టైలర్ రమేష్. నిర్వహకులు మోయిజ్, అహ్మద్ బేగ్, సయ్యద్ గౌస్, సయ్యద్ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.

