తాండూరులో సస్పెన్స్ మర్డర్..!
– ప్రైవేటు పార్టులపై దాడిచేసి హత్య
– పట్టణంలో కలకలం రేపిన ఘటన
– పరిశీలించిన డీఎస్పీ శేఖర్ గౌడ్
తాండూరు, దర్శిని ప్రతినిధి: వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో సస్పెన్స్ మర్డర్ జరిగింది. మంగళవారం ఉదయం వెలుగులోకి వచ్చిన ఈసంఘటన పట్టణంలో తీవ్ర కలకలం రేపింది. పట్టణ ఎస్ఐ అబ్దుల్ రవూఫ్ తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలోని చించొల్లి రోడ్డు ఫయాజ్ పెట్రోల్ పంపు ఎదురుగా ఉన్న రవి టెంట్ హౌస్ దుకాణం వద్ద వ్యక్తి అనునాస్పదంగా మృతి చెందినట్లు స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న డీఎస్పీ శేఖర్ గౌడ్, రూరల్ సీఐ రాంబాబులు ఎస్ఐ అబ్దుల్ రవూఫ్ తో కలిసి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు.
మృతుని వద్ద లభించిన ఆధార్ కార్డు ద్వారా వివరాలను సేకరించారు. మృతుడు ధారూర్ మండలం నాగారం గ్రామానికి చెందిన వీరారెడ్డి(45)గా గుర్తించారు. మృతుని ముఖంతో పాటు ప్రైవేటు పార్టులపై గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేసి హత్య చేసినట్లుగా పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు.

మృతుని తండ్రి నర్సింహారెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నామని ఎస్ఐ అబ్దుల్ రవూఫ్ వెల్లడించారు. మరోవైపు హత్య సంఘటనపై పలువును పలు అనుమానాలను వ్యక్తం చేశారు. అక్రమ సంబంధం నేపథ్యంలోనే హత్య జరిగి ఉంటుందని గుసగుసలాడుకున్నారు. ఈ దిశలో కూడా పోలీసులు విచారణ చేపడుతున్నట్లు తెలుస్తోంది.
ఇదికూడా చదవండి…

