కొత్తగా 166 ఆధార్ కేంద్రాల ప్రారంభం
– అధికారికంగా ప్రకటించిన యూఐడీఏఐ
దర్శని బ్యూరో : భారతీయులకు గుర్తింపు ఇచ్చే ఆధార్ కార్డుల సేవలను అర్హులకు సులభతరం చేసేందుకు యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) చర్యలు తీసుకుంది. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా 166 ఆధార్ నమోదు, నవీకరణ కేంద్రాలను ప్రారంభించినట్లు వెల్లడించింది. ఈ విషయాన్ని ట్విట్టర్ వేధిక ద్వారా ప్రకటించింది. ఇప్పటికే 52,000 ఆధార్ నమోదు కేంద్రాలు బ్యాంకులు, పోస్టాఫీసుల ద్వారా రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహిస్తున్నాయి. తాజాగా 166 కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఆధార్ సేవా కేంద్రాలు వికలాంగులతో సహా 70 లక్షల మంది ప్రజల అవసరాలను తీర్చాయి. మోడల్ A ఆధార్ సేవా కేంద్రాలు (మోడల్- A ASK లు) రోజుకు 1,000 ఆధార్ నమోదులు, అప్డేట్ అభ్యర్థనలను నిర్వహించే సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి. మోడల్ B కేంద్రాలు (మోడల్- B ASK లు) 500, మోడల్-సి ASK లు 250 నమోదులు, అప్డేట్ అభ్యర్థనలను నెరవేర్చే సేవలను అందిస్తోంది.
ప్రైవేట్ ఆధార్ కేంద్రం ఉండదు..
ప్రైవేటుగా ఆధార్ సేవా కేంద్రం ప్రైవేట్‌గా ఉండదని యూఐడీఏఐ స్పష్టం చేసింది. కేవలం బ్యాంకులు, పోస్ట్ ఆఫీసులు, ఉమ్మడి సేవా కేంద్రం (CSC), రాష్ట్ర ప్రభుత్వ అధికారుల కార్యాలయం, UIDAI ద్వారా నిర్వహించే ఆధార్ సేవా కేంద్రాల్లో మాత్రమే అందుబాటులో ఉంటాయి. ఇందుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం, స్థానిక అధికారుల ద్వారా పూర్తి సమాచారాన్నిపొందవచ్చని తెలిపింది.
ఇంటర్నెట్ సెంటర్లలో లభించే సేవలు
కొన్ని నిబంధనలకు లోబడి UIDAI కొంతమందికి ఇంటర్నెట్ సెంటర్లకు పలు సేవలను అప్పగించింది. ఆధార్ కార్డులో పేరు, చిరునామా, పుట్టిన తేదీ లేదా ఇతర వివరాలను సరిచేయడం, ఫోటో మార్చడం, పివిసి కార్డు ముద్రించడం, ఉమ్మడి ఆధార్ కార్డును ఆర్డర్ చేయడం మొదలైన పనులు చేయడానికి అనుమతి ఇస్తుంది.
UIDAI వెబ్సైట్లో మార్పులకు అవకాశం
ఇప్పుడు మొబైల్ యాప్స్ కూడా అందుబాటులోకి వచ్చాయి. UIDAI వెబ్సైట్లో సామాన్యుడు ఈ పనులన్నీ స్వయంగా చేసుకోవచ్చు. పుట్టిన తేదీలో మార్పులు, PVC కార్డు పొందడానికి UIDAI స్థిర రుసుము రూ.50. కానీ ఇంటర్ నెట్ సెంటర్లు రూ.70 నుంచి100 వరకు వసూలు చేస్తారు.

